Indecent post on Nara Brahmani: సోషల్ మీడియా…ఇప్పుడు పరిధి దాటుతోంది. ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి ఒక సాధనంగా మారుతోంది. రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజార్చేందుకు, సభ్య సమాజంలో వారిని తలదించుకునేలా చేస్తోంది. వ్యక్తిగత గోప్యతను, వ్యక్తి హననానికి పాల్పడి మానసికంగా దెబ్బతీస్తోంది. రాజకీయాల్లోకి వ్యూహకర్తల ప్రవేశంతోనే సోషల్ మీడియా కూడా అనుసరించింది. 2014 ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో మోదీ నాయకత్వాన్ని బలపరచడం ద్వారానే ఆయన ప్రధాని అయ్యారు. అదే సోషల్ మీడియా దేశంలోనే.. కాదు కాదు ప్రపంచంలోనే బలమైన నాయకుడిగా నరేంద్ర మోదీని నిలబెట్టింది. అంతెందుకు ఏపీలో జగన్ తిరుగులేని విజయానికి కూడా సోషల్ మీడియాయే కారణం. నాడు చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేసి..నవరత్నాలపై సానుకూలత చూపి ఒకచాన్స్ అంటూ ప్రచారం కల్పించింది సోషల్ మీడియానే. అయితేఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అదే సోషల్ మీడియా కంటగింపుగా మారింది. అందుకే వైసీపీ సోషల్ మీడియా వారియర్ ను బలోపేతం చేసే పనిలో పడ్డారు జగన్. ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడు భార్గవరెడ్డికి అప్పగించారు.

అయితే ఇటీవల సోషల్ మీడియా వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చుతోంది. రాజకీయాల మాటున నేతల కుటుంబసభ్యును టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులు, కామెంట్స్ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులపై వైసీపీ సోషల్ మీడియా విభాగం పెడుతున్న పోస్టులు అన్నీఇన్నీకావు. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి విషయాలు బయటకు వచ్చిన అప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ పోస్టులను బయటపెడుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ బయటకు వచ్చిన తరువాత చంద్రబాబుకు వ్యతిరేకంగా విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. అటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు వైరల్ అయ్యాయి. కామెంట్స్ హద్దులు దాటాయి.
Also Read: Jagan vs Chandrababu: 2024లో చంద్రబాబు ప్రభావమెంత? జగన్ ను ఓడించగలడా?

తాజాగా చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు పెట్టిన వ్యక్తిని టీడీపీ నాయకులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా టేకుపల్లిలో ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన వైసీపీకి విరాభిమాని. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో నారా బ్రాహ్మణిని ఉద్దేశిస్తూ అసభ్యకర పోస్టింగ్ పెట్టాడు. దీనిపై లోకల్ టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్, రంజీత్, నవీన్ , వంశీ అనే టీడీపీ నాయకులు నరసింహకు ఫోన్ చేశారు. అసభ్యకర పోస్టింగ్ లను డిలీట్ చేయాలని సూచించారు. కానీ నరసింహ వినలేదు. పైగా దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నాయకులు నరసింహపై దాడిచేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పార్టీలపై అభిమానం వరకూ ఒకే కానీ.. ఇలా మహిళలపై అసభ్యపదజాలాలతో పోస్టింగ్ లు పెట్టడం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Pawan Kalyan- Godfather Trailer: గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా?
[…] Also Read: Indecent Post on Nara Brahmani: నారా బ్రాహ్మణిపై అసభ్యకర… […]