Pawan Kalyan Bus Specialties: ఏపీలో ఎన్నికలెప్పుడొస్తాయన్న విషయంపై ఇటీల సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా మరో 19 నెలలే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఎన్నికలెప్పుడొస్తాయా..? అని ఎదురుచూస్తోంది. ఇక మరో ప్రధాన పార్థీ జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ప్రజా కార్యక్రమాలతో మమేకమైన ఆ పార్టీ అధినేత పవన్ ఇక బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. బస్సు యాత్ర కోసం పవన్ ప్రత్యేక బస్సును దగ్గరుండీ మరీ తయారు చేయిస్తున్నాడు. ముందుగా దీనిని పూణెలో తయారు చేయించాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లోనే రెడీ చేస్తున్నారు. అయితే ఈ బస్సుకు అనేక ప్రత్యేకతలున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం..

ఆధునిక హంగులతో, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ బస్సును యాత్రకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నారు. ఆయన సూచనల ప్రకారమే రథం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అచ్చం సినిమా క్యారీ వ్యాన్ లా తలపించే ఈ బస్సు చిన్న ఇల్లులా ఉండేలా మార్చుతున్నారు. అంటే ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఈ బస్సులోనే ఉంటాయి. ఈ బస్సులో కనీసం ఆరుగురు వ్యక్తులు సమావేశం కావచ్చు. యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో సమావేశం అవసరమైతే ప్రత్యేకంగా గదికోసం వెతుక్కోకుండా ఇందులోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
గత కొన్ని నెలలుగా పవన్ దూకుడుగా వెళ్తున్నారు. ఈనేపథ్యంలో వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి శక్తుల నుంచి తప్పించుకునేందుకు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బస్సు యాత్రకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిఘానేత్రం కూడా బస్సుకు అమర్చారు. అంటే బస్సుకు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా హై సెక్యూరిటీ విత్ జీపీఎస్ ట్రాకింగ్ ఫిట్ చేస్తున్నారు.
ఇక వాహనం లోపల అన్ని సౌకర్యాలతో పాటు వాహనం పైకి వెళ్లేందుకు పవర్ లిప్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారందరికీ కనిపించేలా సరికొత్త డిజైన్ చేశారు. ఇక సభలో ఉన్నవాళ్లందరికీ వినిపించేలా లెటేస్ట్ సౌండ్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు లైటింగ్ సిస్టంను కూడా ఆధునిక పద్ధతులతో అమర్చారు. ఇక ఈ వాహనం రంగు మిలటరీ రంగులో ఉండేలా చూసుకుంటున్నారు. అచ్చం మిలటరీ వాహం వచ్చినట్లుగానే ప్రజల్లోకి పవన్ బస్సు వెళ్తుందన్నమాట.
మొన్నటి విజయదశమికే ఈ బస్సుల ప్రారంభం కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల సమయం కూడా తెలిసింది. అందువల్ల సాధ్యమైనంత వరకు తొందరగా బస్సును రెడీ చేయాలని పవన్ తయారీ దారులను కోరారు. అంతేకాకుండా అయన స్వయంగా వెళ్లి బస్సును పరిశీలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ బస్సు ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.