Sleep: మనిషికి నిద్ర చాలా అవసరం. మనిషి ఏ రోగాలు లేకుండా జీవించాలంటే నిద్ర కూడా ఉండాల్సిందే. సరిగా నిద్ర లేని వారికి రోగాలు చుట్టుముట్టే అవకాశాలే ఎక్కువ. దీంతో నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రుళ్లు మేల్కొని ఉంటూ నిద్ర పోకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీదే పడుతుంది. వేళకు తిండి, నిద్ర లేకపోతే జీవనం సాఫీగా సాగదు. నిద్ర లేని వారిని వ్యాధులు దరిచేరడం ఖాయమే. దీంతో నిద్రను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. మనిషి జీవితమే సగం నిద్రలో గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో నిద్రకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి రాత్రుళ్లు త్వరగా పడుకుని త్వరగా లేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. నిద్ర పోయే సమయంలో తింటూ తినే సమయంలో నిద్ర పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రతి మనిషి సగటును 7-8 గంటలు నిద్ర పోవాల్సిందే. లేదంటే వ్యాధులు దరిచేరే ప్రమాదం పొంచి ఉంటుంది. రాత్రుళ్లు సరిగా నిద్ర పోకుండా తెల్లవార్లు మేల్కొని ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటే మనుగడ కష్టమవుతుంది. అందుకే నిద్ర పోవడానికి కేటాయించిన సమయంలో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలే కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తే మనకు ఇబ్బందులు తప్పవు. మనిషి జీవితం సగం నిద్రలోనే గడిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. నిద్రకు మన పూర్వీకులు అంత ప్రాధాన్యం ఇవ్వడంతోనే వారికి ఎలాంటి రోగాలు లేకుండా జీవించారని తెలుస్తోంది.
సరైన నిద్ర లేకపోతే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అన్ని జబ్బులకు నిద్ర పరిష్కారమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రను అలక్ష్యం చేయకుండా సరైన సమయంలో నిద్ర పోతే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. తిండి ఎంత బలమో నిద్ర కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. ప్రస్తుత కాలంలో యువత తెల్లవార్లు మేల్కొని ఉంటూ పొద్దంతా నిద్రపోతూ బద్దకస్తులుగా మారుతున్నారు. దీంతో రోగాలకు దగ్గరవుతున్నారు. ఆధునికత పేరుతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారు.

స్మార్ట్ ఫోన్లు వచ్చాక కూడా కాలక్షేపం చేస్తున్నారు. రాత్రుళ్లు నిద్ర పోకుండా జబ్బులు కొనితెచ్చుకుంటున్నారు. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు అలుముకుంటాయి. కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్ర లేకపోతే బరువు పెరగడం, కొవ్వు ఎక్కువ అయ్యే సూచనలు కూడా ఎక్కువే. ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తేనే బాగుంటుంది. రాత్రుళ్లు సుఖంగా నిద్రపోయి పొద్దంతా పనులు చేసుకుంటేనే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. నిద్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త పనికిరాదు. కంటి నిండా నిద్ర ఉంటేనే మనకు ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.