https://oktelugu.com/

BJP Success Secret: బీజేపీ విజయ రహస్యం ఏంటో తెలుసా?

BJP Success Secret: దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయతీరాలు చేరుకుంది. బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి అందరి అంచనాలు తలకిందులు చేసింది. దీనికి జాతయ నేతల కృషే అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం రాష్ట్రంలో పార్టీని విజయఢంకా మోగించేందుకు సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. వారు రచించిన వ్యూహాలే పార్టీకి ఊపునిచ్చాయని […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2022 / 11:52 AM IST

    BJP

    Follow us on

    BJP Success Secret: దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయతీరాలు చేరుకుంది. బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి అందరి అంచనాలు తలకిందులు చేసింది. దీనికి జాతయ నేతల కృషే అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం రాష్ట్రంలో పార్టీని విజయఢంకా మోగించేందుకు సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. వారు రచించిన వ్యూహాలే పార్టీకి ఊపునిచ్చాయని చెబుతున్నారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారం దక్కించుకునేందుకు భాగస్వాములు కావడం తెలిసిందే.

    BJP

    ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ ఎప్పుడు ముందుంటుంది. సాంకేతికతను ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే యూపీలో మోడీ-షా ధ్వయం ఆధ్వర్యంలో బీజేపీ అప్రతిహ విజయాలు సొంతం చేసుకుంటోంది. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోభారం, సాగు చట్టాల ఉద్యమం, లఖింపూర్ ఘటన ఇవేవీ బీజేపీ విజయాన్ని ఆపలేకపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో కూడా బీజేపీ దేశంలో మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి.

    Also Read:  మోడీ రిటైర్ మెంట్.. యోగికి అపాయింట్ మెంట్?

    మోడీ మేనియాతోనే బీజేపీ విజయాలు సాధిస్తుందనేది నిర్వివాదాంశం. మోడీ చేపడుతున్న పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఓటర్లకు బీజేపీపై విశ్వాసం కలుగుతోంది. అందుకే నాలుగు రాష్ట్రాల్లో పార్టీని ముందంజలో నిలిపారు. మోడీ-అమిత్ షాలు పార్టీకి గెలుపు గ్రామర్ గా నిలుస్తున్నారు. వారు చేపడుతున్న విధానాలతోనే బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా మోడీ గాలికి ఇంకా ఎదురులేదని నిరూపిస్తోంది.

    బీజేపీని దేశమంతటా విస్తరించడానికి సరికొత్త కోణాల్లో ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేశారు. దీంతో పార్టీ కింది స్థాయి కార్యకర్తల వరకు బహుళ ప్రచారం నిర్వహించి ప్రభావం చూపారు. ఈ క్రమంలో అసాధారణ స్థాయిలో దూసుకెళ్లింది. అమిత్ షా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మోడీ-షా ద్వయం రూపొందించిన కార్యక్రమాలు బీజేపీని విజయం సాధించిందని తెలుస్తోంది. రెండో సారి యోగికి అధికారం దక్కేలా చేశారని చెబుతున్నారు.

    PM Narendra Modi

    2024 ఎన్నికల్లో కూడా ఇదే మంత్రాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. దేశంలో ప్రతిపక్షం లేకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారడంతో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగినా ఆప్ ప్రత్యామ్నాయంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దానికి ఇంకా సమయం పట్టే అవకాశంఉంది. దీంతో ఇప్పుడు బీజేపీకి ఎదురే లేదని నేతలు ధీమాగా ఉన్నారు.

    Also Read: ఇదో చరిత్ర: యూపీలో రెండోసారి బీజేపీ గెలవడానికి కారణాలివీ!

     

    Tags