https://oktelugu.com/

Mukesh Ambani : 2025 మొదటి వారం అంబానీ, అదానీ, ఎలన్ మస్క్ ల సంపాదన ఎలా ఉందో తెలుసా? ఈ బిలియనీర్ల సంపద కూడా పెరిగిందా?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్. ఈయన సంపద గురించి తెలిస్తే నోరు ఎల్లబెట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటుంది మస్క్ సంపాదన.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 7, 2025 / 04:00 AM IST

    Mukesh Ambani

    Follow us on

    Mukesh Ambani : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్. ఈయన సంపద గురించి తెలిస్తే నోరు ఎల్లబెట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటుంది మస్క్ సంపాదన. ఇక మస్క్ మొదటి వారంలోనే భారీగా వసూళ్లు రాబట్టాడు. అదే సమయంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సంపదలో గణనీయమైన పెరుగుదల వచ్చిందట. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తకు కొత్త సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉందని సమాచారం. ఏడాది తొలి వారంలో టాప్ 10 బిలియనీర్ల జాబితాలో ఒక్కరు మినహా అందరి సంపద పెరిగింది. మరి ఎవరెవరి సంపదన ఎలా ఉందంటే?

    బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం, అతని సంపద గత 24 గంటల్లో 22.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.88 లక్షల కోట్లు) పెరిగింది. ఈ జంప్‌తో మస్క్ మొత్తం సంపద ఇప్పుడు 437 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్నుడైన జెఫ్ బెజోస్ సంపదలో కూడా భారీ పెరుగుదల ఉంది. జనవరి 1, 5 మధ్య, బెజోస్ మొత్తం 4.29 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 36,793 కోట్లు) ఆర్జించారు. బెజోస్ మొత్తం సంపద ఇప్పుడు 243 బిలియన్ డాలర్లు.

    కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా భారీగా పెరిగింది. జుకర్‌బర్గ్ సంపద 6.56 బిలియన్ డాలర్లు పెరిగింది.

    ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్నుడైన లారీ ఎల్లిసన్ సంపద 1.61 బిలియన్ డాలర్లు పెరిగింది. అతని మొత్తం నికర విలువ 192 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి సంపద క్షీణించింది. అయినా సరే ఈయన మాత్రం టాప్-10 బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో సంపద తగ్గిన వ్యక్తి ఈయన ఒక్కరే.

    భారతీయ బిలియనీర్ల గురించి మాట్లాడుతూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు 2.47 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 21,184 కోట్లు) ఆర్జించారు. అంబానీ మొత్తం నికర విలువ ఇప్పుడు 93.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 17వ స్థానంలో ఉన్నాడు.

    గౌతమ్ అదానీ సంపద మరోసారి క్షీణించింది. గౌతమ్ అదానీ ఒక్క రోజులో 840 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,204 కోట్లు) నష్టపోయాడు. ఈ పతనం తర్వాత, అతని మొత్తం సంపద $78 బిలియన్లకు పడిపోయింది.