Homeజాతీయ వార్తలుPoliticians Dressing Style: మన రాజకీయ నాయకుల డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో తెలుసా?

Politicians Dressing Style: మన రాజకీయ నాయకుల డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో తెలుసా?

Politicians Dressing Style: పూర్వం మనుషులు బట్టలు వేసుకునే వారు కాదు. కాలక్రమంలో ఆకులు కట్టుకునేవారు. తరువాత బట్టలు నేయడం తెలుసుకుని నాగరికత కూడా నేర్చుకున్నాడు. దీంతో రకరకాల బట్టలు తయారు చేయడం తెలుసుకున్నాడు. ప్రస్తుతం బట్టలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ గా చూస్తున్నారు. మనం వేసుకునే దుస్తులే మన స్థాయిని సూచిస్తాయి. మనం వేసుకునే బట్టలను బట్టి మన స్థాయి తెలుస్తుంది. రాజకీయ నేతలు ఒకలా, వ్యాపారస్తులు మరోలా, సామాన్యులు ఇంకలోలా దుస్తులు వేసుకోవడం మామూలే. మన ఆహార్యం మనం వేసుకునే దుస్తుల్లోనే తెలుస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మగాంధీ గోచీ పెట్టుకునే తిరిగేవారు. అది ఆయన డ్రెసింగ్ స్టైల్.

Politicians Dressing Style
Modi, Droupadi Murmu

స్వాతంత్య్రం రాకముందు అనేక ఉద్యమాలు జరిగాయి. అందులో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉండటం విశేషం. అలా మనవారు మనదేశంలో తయారయ్యే ఖద్దరునే ధరించాలనే డిమాండ్ ఆనాటిదే. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు. రాజకీయ నేతలు మాత్రమే వాడుతున్నారు. మిగతావారందరు ఇతర దుస్తులనే వాడుతున్నారు. సంప్రదాయ బద్ధంగా మనం వాడుకునే దుస్తుల విషయంలో మనకు ఎన్నో ఆలోచనలు ఉండటం సహజం. దుస్తులు వేసుకునే క్రమంలో మనం పలు రకాల కలర్లు వాడేందుకు కూడా ఇష్టపడుతుంటాం.

మన రాజకీయ నేతలది ఒక్కొక్కరిది ఒక్కో విధానం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖాదీ చీరలను ఇష్టపడుతుంటారు. వాటిని ఎక్కువగా కట్టుకుంటారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. కుర్తా, పైజామా, జాకెట్ వేసుకుంటారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అక్కడి వేషధారణ ప్రకారం దుస్తులు ధరిస్తుంటారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొక్కా పంచె ధరించి సాధారణంగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఆయన అలాగే ఉంటుంటారు.

Politicians Dressing Style
KCR – Jagan And Chandrababu

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఖాదీ దుస్తులే ధరిస్తుంటారు. సాదాసీదాగా కనిపిస్తారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎక్కువగా టీషర్ట్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సమావేశాలకు మాత్రం కుర్తా పైజామా వేసుకోవడం అలవాటు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఖాదీ దుస్తుల్లోనే దర్శనమిస్తుంటారు. చొక్కా, ప్యాంట్ ధరించడం తెలుసు. వీటిని ఆయన ఒకే దర్జీ దగ్గర వాటిని కుట్టించుకుంటారట. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మామూలు చొక్కా, ప్యాంట్ ధరిస్తారు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం సూట్ వేసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు ముదురు గోధుమ రంగు చొక్కా, ప్యాంటు వేసుకుంటారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖాదీ చీరను ధరిస్తారు. వివిధ రంగుల బార్డర్ ఉండేలా ఇష్టపడుతుంటారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సాధారణంగా కనిపిస్తారు. పైజామా, లాల్చీనే వాడుతారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలుపు రంగు చొక్కా, లుంగీ వేసుకుంటారు. ఇలా మన వేషధారణ విషయంలో కొన్ని ప్రత్యేకతలు ఉండటం సహజమే. మనం వేసుకునే బట్టలు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెలియజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version