https://oktelugu.com/

IQ Rankings : ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్లు మాత్రమే పుట్టే దేశం ఏంటో తెలుసా ?

ప్రపంచంలో ఏది సాధించాలన్న ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన తెలివి తేటలతో వస్తుంది. ప్రపంచంలో చాలా మంది ఎన్నో కొత్త విషయాలను ఆవిష్కరించారంటే కారణం వారికి ఉన్న తెలివితేటలే. సాధారణ మనుషుల కంటే కూడా ఇలాంటి వాళ్లకు కాస్త తెలివితేటలు ఎక్కువగా ఉండడం మూలానా వీరు నలుగురిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

Written By: , Updated On : February 19, 2025 / 03:35 PM IST
IQ Rankings

IQ Rankings

Follow us on

IQ Rankings : ప్రపంచంలో ఏది సాధించాలన్న ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన తెలివి తేటలతో వస్తుంది. ప్రపంచంలో చాలా మంది ఎన్నో కొత్త విషయాలను ఆవిష్కరించారంటే కారణం వారికి ఉన్న తెలివితేటలే. సాధారణ మనుషుల కంటే కూడా ఇలాంటి వాళ్లకు కాస్త తెలివితేటలు ఎక్కువగా ఉండడం మూలానా వీరు నలుగురిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు ఐక్యూ- ఇంటెలెక్చువ‌ల్ క్వాలిటీలో ప్రపంచంలో ఏ దేశస్తులకు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా.. ఏంటి అగ్రదేశాలు కాబట్టి అమెరికా, ర‌ష్యా, ఇండియా, చైనా ఇంకేముంటాయని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఓ చిన్న దేశం.. పైగా దాని మీద రెండు అణుబాంబు దాడులు కూడా జరిగాయి. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలబడింది. అన్ని దేశాల కంటే కూడా ఓ 50ఏళ్లు అడ్వాన్స్ డ్ గా ఉంటుంది. ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.. ఆ దేశం పేరే జపాన్. ఇది మేం చెప్పిన మాట కాదు ప‌రిశోధ‌న‌లు చెప్పిన విష‌యాలు. ప్రపంచంలోని అత్యధిక సగటు ఐక్యూ స్కోరు ఉన్న దేశంగా జపాన్ అవతరించింది. ఈ విషయాన్ని ఉల్స్టర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన పరిశోధన తెలియజేసింది. జపాన్ సగటు ఐక్యూ స్కోరు 106.48గా ఉంది. ఇది తైవాన్‌ను కేవలం 0.01 పాయింట్‌తో అధిగమించింది. ఆసియాకు చెందిన దేశాలు .. సింగపూర్, హాంకాంగ్, చైనా, దక్షిణ కొరియా తదితరాలు మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయి.

2002లో ప్రముఖ మనస్తత్వవేత్త రిచర్డ్ లిన్, రాజకీయ శాస్త్రవేత్త టాటు వాన్హానెన్ రాసిన ‘ఐక్యూ అండ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్'(IQ and the Wealth of Nations) పుస్తకంలో ఈ వివాదాస్పద డేటాను మొదట ప్రచురించారు. ఆ తరువాత జపాన్ దేశం ఈ జాబితాలో రెండవసారి అగ్రస్థానాన్ని కలిగి ఉంది. జపాన్ సగటు మేధస్సు గణాంకం ఐక్యూ గణాంకాలు తరచుగా అప్‌డేట్ చేశారు. 2002 నుండి ఆ దేశ సగటు మేధస్సు గణాంకం ఐక్యూ కొలత అనేకసార్లు అప్‌డేట్ అయింది. ఇటీవల లిన్ , డేవిడ్ బెకర్ 2019లో విడుదలైన ‘ది ఇంటెలిజెన్స్ ఆఫ్ నేషన్స్’ పుస్తకంలో 132 దేశాలలో పౌరుల సగటు ఐక్యూని గణించగా, 71 ఇతర దేశాలకు సంబంధించిన స్కోర్లను అందించింది. గత రెండు దశాబ్దాలలో ఈ జాతీయ ఐక్యూ జాబితాలు చాలా చర్చకు దారితీశాయి. అయితే ఈ జాతీయ ఐక్యూ జాబితాలు గత రెండు దశాబ్దాలుగా పెద్ద చర్చకు దారితీశాయి. చాలా మంది పండితులు ఈ డేటాను పునరాలోచించారు, అయితే కొందరు విమర్శలు కూడా వ్యక్తం చేశారు.

2003లో థామస్ వోల్కెన్ ఈ సర్వేలను “చాలా లోపభూయిష్టమైనవి” అని వ్యాఖ్యానించారు. సుసాన్ బార్నెట్, వెండి విలియమ్స్ వాటిని “వాస్తవంగా అర్థరహితమైనవి” అని అభిప్రాయపడ్డారు. తాజా వెర్షన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ఈ డేటాలో ఎక్కువ భాగం చాలా చిన్న నమూనాల నుంచి సేకరించారు. ఆ నమూనాల దృష్టిలో సమాజాన్ని పూర్తిగా ప్రతిబింబించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ జాతీయ ఐక్యూ డేటా ఆధారంగా ఉన్న వివాదాలపై ఇంకా పెద్ద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొంద‌రు పండితులు వాటిని స్వాగతించారు. అయితే కొంద‌రు ప్రజల మాత్రం తీవ్రంగా విమర్మిస్తున్నారు.