
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు అపరిచితుడిగా మారితే ఎలా ఉంటాడో ప్రత్యర్థులు ఊహించి చేస్తున్న ట్రోల్ వైరల్ అవుతోంది. చంద్రబాబు మాట అడ్డంగా మార్చేసిన ఉదంతాలను కలిపి చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గతంలో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు సమయంలో అందరు సీఎంల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈక్రమంలోనే పెద్ద నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ పెట్టాలని ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కోరాడట.. దాన్ని ఆయన ఒక సభలో అన్నారు కూడా.

ఆ తర్వాత మోడీతో విడాకులు తీసుకున్నాక పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక రంగం కుదేలైన విషయాన్ని.. ఆర్థికంగా ప్రజలు పడ్డ బాధలను వివరిస్తూ ఇదే చంద్రబాబు స్వయంగా మోడీపై విమర్శలు గుప్పించారు. ఆ వీడియోను కట్ చేసి ఈ రెండింటిని కలిపి రాముగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా మాట్లాడాడు.. అపరిచితుడిగా మారాక మోడీని ఎలా తిట్టాడన్న విషయంపై వీడియోను రెడీ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు అపరిచితుడు అని జరుగుతున్న ఈ ట్రోలింగ్ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని మీరూ కింద చూసి ఎంజాయ్ చేయండి..