spot_img
Homeజాతీయ వార్తలుDMart : డీమార్ట్ పేరిట లింక్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ పని ఖతమే

DMart : డీమార్ట్ పేరిట లింక్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ పని ఖతమే

DMartDMart : ఆన్ లైన్ మోసాలు(Online Scam) పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ మోసాలు చేస్తున్నారు. ఉచితం అనే మాటను ఎరగా వేస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. ప్రజల అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు తెరతీస్తున్నారు. ఈసారి వారు డీమార్ట్(DMart) నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. లేనిపోని ఆఫర్లు ప్రకటించి జేబులు గుళ్ల చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రజలను ఇట్టే బుట్టలో వేసుకుని వారి ఖాతాలోని డబ్బులను కానిచ్చేస్తున్నారు. ఏం జరిగిందో తెలిసే లోపే తమ ఖాతాలు పైసలు మాయం కావడంతో కంగుతింటున్నారు.

డీమార్డ్ షాపింగ్ మాల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఉచితంగా బహుమతులు అందజేస్తుందని ఓ లింక్ నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో వినియోగదారులు పొరపాటున లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. డీమార్డ్ కుంభకోణానికి సంబంధించి ఫేక్ లింక్ ను ట్విటర్ లో పోస్టు చేసిన సైబర్ వింగ్ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ చేయొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనవసర ఆశలకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

లింక్ ను క్లిక్ చేయగానే ఓ వెబ్ సైట్ ఓపెన్ అయి అందులోని ఓ స్పిన్నర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు బహుమతులు వచ్చాయని ఓ సందేశం వస్తుంది. వాటిని తీసుకోవాలంటే ఆ లింక్ ను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అంటూ సూచన వస్తుంది. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నా రోజుకో కొత్త స్కాం వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం డీమార్డ్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ప్రజలు ఆ యాప్ ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నకిలీ యాప్ లపై అప్రమత్తంగా ఉంటూ వారి మోసాలను తిప్పికొట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version