https://oktelugu.com/

గర్భవతిని అని కూడా చూడకుండా వేధించారు!

చేసింది మూడు సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ముద్రవేసింది సమీరా రెడ్డి. 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత అశోక్, జై చిరంజీవా చిత్రాలతో సమీరా నటించడం జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్, సమీరా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రావడం జరిగింది. వీరి ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్లనుందని కూడా అనుకున్నారు. ఐతే సమీరా రెడ్డి నటించిన మూడు సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 02:15 PM IST
    Follow us on


    చేసింది మూడు సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ముద్రవేసింది సమీరా రెడ్డి. 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత అశోక్, జై చిరంజీవా చిత్రాలతో సమీరా నటించడం జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్, సమీరా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రావడం జరిగింది. వీరి ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్లనుందని కూడా అనుకున్నారు. ఐతే సమీరా రెడ్డి నటించిన మూడు సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాలేదు. హిందీ, తమిళ్ చిత్రాలలో ఆఫర్స్ వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు.

    Also Read: క్రాక్‌ సినిమా టీం ఆలోచన సక్సెస్‌ తెచ్చిపెట్టేనా

    పెళ్ళైన తరువాత 2015లో ఓ అబ్బాయికి జన్మనిచ్చిన సమీరా రెడ్డి, 2019లో అమ్మాయిని కనడం జరిగింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఫోటో షూట్స్ చేసిన సమీరా ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐతే మొదటిసారి గర్భం దాల్చిన సమయంలో సమీరా రెడ్డి ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను తెలియజేశారు. 2015లో గర్భం దాల్చిన సమీరా మానసికంగా సిద్ధంగా లేదట. గర్భవతిగా ఆమె చిరాకు, ఆందోళనకు గురయ్యేవారట. దానికి తోడు సమీరా బాడీ షేమింగ్ గురయ్యారట. గర్భవతి అని కూడా చూడకుండా సమీరా శరీరంపై కొందరు కామెంట్స్ చేశారట. అవి మానసికంగా తనను చాలా ఇబ్బంది పెట్టినట్లు ఆమె తెలిపారు.

    Also Read: దెబ్బతిన్న హీరోలకు ఇప్పుడు ఆ డైరెక్టరే దిక్కు

    ఆ సమయంలో భర్త అండగా నిలిచి, సమస్య నుండి బయటపడడానికి మద్దతు ఇచ్చాడని సమీరా తెలియజేశారు. గర్భం దాల్చే ముందు ఆడవాళ్లు మానసికంగా సిద్ధంగా, దృఢంగా ఉండాలి అన్నారు. ఇక మరలా నేను సన్నగా… పూర్వస్థితికి చేరడానికి కొంచెం సమయం పడుతుందని సమీరా రెడ్డి తెలియజేశారు. మరో వైపు సమీరా రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె బాలీవుడ్ లో నటిస్తారో టాలీవుడ్ లో నటిస్తారో చూడాలి. 2012లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఐటెం సాంగ్ లో కనిపించిన సమీరాకు, టాలీవుడ్ లో అదే చివరి చిత్రం. ఇక హీరోయిన్ గా 2013లో వచ్చిన వరదనాయక అనే కన్నడ చిత్రం చివరిది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్