https://oktelugu.com/

Divya Vani: దివ్యవాణి ఎందుకిలా చేసింది? టీడీపీలో ఉన్నట్టా? జగన్ కోవర్టా?

Divya Vani: ఏపీలో రాజకీయాలు ఈ మధ్య హాట్ హాట్ గా సాగుతున్నాయి.. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో కొందరు నాయకులు అసమ్మతిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న సినీ నటి దివ్యవాణి ఇటీవల రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె టీడీపీకి రాజీనామా ప్రకటించడం.. ఆ తరువాత వెనక్కి తీసుకోవడంపై జోరుగా చర్చ సాగుతోంది. ఎంతో కాలంగా టీడీపీలో ఉంటున్న ఆమె రాజీనామా వరకు ఎందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2022 1:03 pm
    Follow us on

    Divya Vani: ఏపీలో రాజకీయాలు ఈ మధ్య హాట్ హాట్ గా సాగుతున్నాయి.. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో కొందరు నాయకులు అసమ్మతిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న సినీ నటి దివ్యవాణి ఇటీవల రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె టీడీపీకి రాజీనామా ప్రకటించడం.. ఆ తరువాత వెనక్కి తీసుకోవడంపై జోరుగా చర్చ సాగుతోంది. ఎంతో కాలంగా టీడీపీలో ఉంటున్న ఆమె రాజీనామా వరకు ఎందుకు వెళ్లారని చర్చించుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన టీడీపీ మహానాడులో దివ్యవాణికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడంతోనే ఆమె మనసులో ఉన్న ఆవేదనను వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమె పార్టీలోని కొందరు నాయకులతో తీవ్ర ఇబ్బంది పడుతోందని, అయితే పార్టీ నుంచి బయటపడడానికి ఇదే మార్గమని ఆలోచించినట్లు కొందరు అంటున్నారు.

    దివ్యవాణి సన్నిహితులు చెబుతున్న ప్రకారం.. టీడీపీలో ఓ వర్గం డామినేషన్ అధికంగా ఉందట. పార్టీ అధికార ప్రతినిధుల్లో ఎక్కువగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, వారు ఏం చెబితే అదే జరగాలని ఆర్డర్ వేస్తున్నట్లు అనుకుంటున్నారు. దివ్యవాణి క్రైస్తవ మతానికి చెందినవారు. అటు ఏపీ సీఎం జగన్ ఈ మతానికి చెందిన వారే. దివ్యవాణి ఈ మత సంబంధం కారణంగా పార్టీలోని కొన్ని విషయాలను జగన్ కు చేరవేరుస్తున్నారని, అందుకే దివ్వవాణిని పక్కకు బెడుతున్నారని అంటున్నారు. దీంతో కొందరు దివ్యవాణి కోవర్టు అనే ముద్ర వేసినట్లు సమాచారం. దివ్యవాణి మాత్రమే కాకుండా ఈ మతానికి చెందిన కొందరిని పక్కకు పెట్టాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించారని అంటున్నారు.

    Also Read: KCR vs BJP: జూన్ 2 ముహూర్తం.. బీజేపీపై కేసీఆర్ బయటపడుతాడా?

    ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇటీవల నిర్వహించిన మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. మహానాడులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె అప్పటి నుంచే ఆవేదనతో ఉంది. దీంతో ఎలాగైనా ఈ విషయంపై తేల్చుకోవాలని అనుకున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అయితే రాజీనామా ఉపసంహరించుకున్నా పార్టీలో ఆమెకు ఇబ్బందులు తప్పవని కొందరు అంటున్నారు.

    పార్టీలో కొందరి పెత్తనం ఎక్కువైందని వారు దివ్వవాణి లాంటి వారిని పక్కనబెడుతారని అంటున్నారు. అయితే తనకు జరిగిన ఆవేదనపై దివ్యవాణి పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్లింది. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల కోసం పార్టీ సమాలోచనలు పడుతుండగా ఇప్పటి నుంచే అసమ్మతి ప్రారంభమవడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల పొత్తులతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న టీడీపీ నుంచి దివ్యవాణి లాంటి వాళ్లు ఇంకెంతమంది బయటపడుతారోనని అనుకుంటున్నారు.

    Also Read: AP Teacher: మోడీ అభినందన అందుకున్న ఆంద్రప్రదేశ్ మాస్టార్ ఎవరు? ఆయన కథేంటి?

    Recommended Videos: