AP Politics: చివరకు క్రిస్టియన్లకూ ఏపీలో అసంతృప్తియేనా?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై అసమ్మతి పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల్లోనే కాదు సొంత ఇంటిలో కూడా వేరు కుంపటి రగులుతోంది. ఇన్నాళ్లు జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్న బావ బ్రదర్ అనిల్ అసంతృప్తితో రగిలిపోతున్నారు.క్రైస్తవ సమాజం మొత్తం జగన్ వెంట ఉన్నా ఆయన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో […]

Written By: Srinivas, Updated On : March 8, 2022 10:55 am

CM Jagan

Follow us on

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై అసమ్మతి పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల్లోనే కాదు సొంత ఇంటిలో కూడా వేరు కుంపటి రగులుతోంది. ఇన్నాళ్లు జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్న బావ బ్రదర్ అనిల్ అసంతృప్తితో రగిలిపోతున్నారు.క్రైస్తవ సమాజం మొత్తం జగన్ వెంట ఉన్నా ఆయన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో పరిణామాలు మారేలు కనిపిస్తున్నాయి.

AP CM Jagan

ఇన్నాళ్లు జగన్ కు అండగా నిలిచిన క్రైస్తవులు ఇకపై మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు జగన్ వ్యవహారం సాగుతోంది. దీంతోనే వారు జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కు సొంత ఇంటిలోనే వేరు కుంపటి రగిలించినట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్ని కల్లో ఇంకా రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో తెలియడం లేదు.

Also Read: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?

మరోవైపు తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల ఏపీలో కూడా పార్టీ పెడతారనే వాదన రాజకీయ విశ్లేషకుల్లో వస్తోంది. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు రావడంతో జగన్ వ్యవహారంలో అందరు బాధ్యులే అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగన్ పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని పార్టీ వర్గాల్లోనే నిరాశ నిస్ర్పహలు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఆలోచిస్తున్నారు.

బ్రదర్ అనిల్ పరోక్షంగా జగన్ పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. సొంత పార్టీ పెడతామనే సంకేతాలు ఇస్తున్నారు. సోదరి షర్మిలతో కలిసి ఏపీలో మరో పార్టీ వస్తుందేమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ మేరకు వారి మాటల్లో అంతరార్థం కూడా అలాగే ఉండటంతో ఇక జగన్ కు తలనొప్పులు తప్పవేమోనని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత జఠిలంగా మారే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CM YS Jagan

వచ్చే ఎన్నికల్లో మరిన్ని పరిణామాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సొంత కుటుంబంలోనే మరో పార్టీ వస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని జగన్ ఆలోచనలో పడుతున్నారు. ఎలాగైనా కుటుంబంలో నెలకొన్న విభేదాలను తొలగించుకోవాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి జగన్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

Tags