Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ మొదలై వారం గడిచింది. ఫస్ట్ వీక్ లో ఊహించని విధంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక రెండో వారం నామినేషన్స్ ముగిశాయి. ఈసారి ఏకంగా 11 మంది నామినేట్ కావడం సంచలనమైంది.

కాగా మొదటి వారంలో నామినేషన్స్ సమయంలో అఖిల్ ను నామినేట్ చేసింది బిందుమాధవి. అఖిల్ కారణంగా గేమ్ ఆగిందని.. మొత్తం టీంను కంట్రోల్ చేస్తున్నాడని ఆరోపించింది.ఇక వీకెండ్ ఎపిసోడ్ లో డాన్స్ చేసేప్పుడు కూడా తనకు పోటీగా అఖిల్ ను చాలెంజ్ చేసింది బిందుమాధవి.
Also Read: అరె.. ఎంతో ఓపికగా అందరికీ పంచి పెట్టింది
ఇక మొదట్లో గొడవపడ్డ ఎన్నో జంటలు చివరి వరకూ ఆ టెంపో మెయింటనేన్ చేస్తూ ఫోకస్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, అఖిల్ ల మధ్య ఈ వార్ సాగింది. ఇప్పుడు అఖిల్ కు బిందుమాధవి టఫ్ ఫైట్ ఇచ్చేలా కనిపిస్తోంది.
అఖిల్ కు సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలిమినేట్ కావడం కష్టమే. ఎక్కువ వారాలు అతడు హౌస్ లో ఉండే అవకాశం ఉంది.

ఇక బిందుమాధవి నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియదు. హౌస్ లో ఎన్నిరోజులు ఉంటుందో కూడా అంచనావేయడం కష్టమే. బిందుమాధవి చాలా సాఫ్ట్ డీసెంట్ గా కనిపిస్తోంది. తమిళ బిగ్ బాస్ లో ఈమె దూసుకుపోయింది. దీంతో తెలుగులోనూ ఈ భామ టాప్ 5లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ లో వున్నది వీరే..!