Homeజాతీయ వార్తలుPM Narendra Modi Navratri Fast: మోడీ ఉపవాసం కథేంటి?: ఆయన ఇష్టంగా తినేది ఏంటి?

PM Narendra Modi Navratri Fast: మోడీ ఉపవాసం కథేంటి?: ఆయన ఇష్టంగా తినేది ఏంటి?

PM Narendra Modi Navratri Fast: రెండు పదుల వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. ఊబ కాయం ముంచుకొస్తుంది. నాలుగు అడుగులు వేయాలంటే ఆయాసం తన్నుకొస్తోంది. దీనికి తోడు మధుమేహం, రక్తపోటు… ఇంక చాలా.. కానీ ఏడుపదుల వయసులో ఉన్న వ్యక్తి దేవి నవరాత్రుల సమయంలో కఠిన ఉపవాసం ఉండటం సాధ్యమేనా? వృద్ధాప్యం, సమస్యలు ముంచుకొచ్చే వయసులో రోజుకు 14 గంటల పాటు పనిచేయడం అయ్యే పనేనా? మిగతా వారి విషయంలో ఏమోగానీ.. పైవన్నీ కూడా భారత ప్రధాని మోడీకి సాధ్యమే. 72వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన.. ఇంతకీ రోజు ఏం తింటారు? ఎలాంటి జీవనశైలిని అనుసరిస్తారు? దీనిపై ప్రత్యేక కథనం

PM Narendra Modi Navratri Fast
PM Narendra Modi

ఇప్పటికీ ప్రధానమంత్రి రోజంతా బిజీబిజీగా ఉంటారు. చురుగ్గా పనులు చేసుకుంటూ ఉంటారు. ఎంత లేదన్నా గంటలపాటు పనిచేస్తూనే ఉంటారు. వయసులోనూ ఆయన ఇంత చురుగ్గా ఉండడానికి కారణం ఆయన అనుసరించే జీవనశైలే. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఆహార నియమాలు తప్పకుండా పాటిస్తారు. ప్రతిరోజు ఆయన తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. యోగా, సూర్య నమస్కారాలు, ధ్యానం చేస్తారు. ఫిట్ గా ఉండేందుకు చాలా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. రిచ్ లేదా స్పైసి ఫుడ్ కు ఆయన దూరంగా ఉంటారు. ఎక్కువగా సాధారణ గుజరాతి ఆహారాన్ని ఇష్టపడతారు. అన్నింటికంటే కిచిడిని అమితంగా ఇష్టపడతారు. ఆహారాన్ని సమతౌల్యం చేసుకునేందుకు ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తింటారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోహన్ ప్రాంతంలో లభ్యమయ్యే పుట్టగొడుగులను తింటారు. అందులో పోషకాలు మెండుగా ఉండటమే ఇందుకు కారణం. ఆ పుట్టగొడుగు శాస్త్రీయ నామం మాక్రులా ఎక్స్ లెంటా. గోధుమ పిండితో తయారుచేసే పరోటాలు కూడా ఇష్టంగా తింటారు.

Also Read:Komaram Bheem Adivasi Bhavan: నిన్న దళితులు.. రేపు గిరిజనులు.. మరో సంచలనానికి తెరతీయబోతున్న కేసీఆర్‌!

అమెరికా పర్యటనలోనూ ఉపవాసం

70 ఏళ్లు పైబడినప్పటికీ ప్రధానమంత్రి మోడీ ఇప్పటికీ దేవి నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉంటారు. శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం చాలా మంచి టెక్నికల్ నమ్ముతారు. ఆయన గత 35 ఏళ్లుగా నవరాత్రుల కోసం ఉపవాసం ఉంటున్నారు. 2014లో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా తన సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదు. ఆ సమయంలో కేవలం నిమ్మరసం మాత్రమే తాగారు. యోగాసనాలు ఎక్కువగా వేసే మోదీ.. ఈరోజు యోగా చేస్తారు. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఆయన నమ్ముతారు. తన దినచర్యలో ఉదయం ధ్యానం, నడక, యోగ తప్పకుండా ఉండేలా చూసుకుంటారు.

PM Narendra Modi Navratri Fast
PM Narendra Modi

వాటితోనే ఆయన తన రోజును ప్రారంభిస్తారు. వీటితోపాటు సూర్య నమస్కారాలు చేస్తారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సాధన ప్రాముఖ్యతను మోడీ హైలెట్ చేశారు. 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మోడీ పిలుపు అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. కేవలం గుజరాతి వంటకాలకు కాకుండా అస్సామీ నల్లబియ్యానికి కూడా మోదీ ప్రాధాన్యం ఇస్తారు. మాంసాహారం జోలికి అసలు వెళ్ళరు. మద్యం అసలు ముట్టరు. అందుకే ఈ వయసులోనూ ఆయనకు జ్వరం అంటే ఏంటో కూడా తెలియదు. పంటి నొప్పి, కంటి నొప్పి అంటే కూడా తెలియదు. అంతటి కరోనా సమయంలో కూడా ఆయన కోవిడ్ బారిన పడలేదంటే ఆయన వ్యాధి నిరోధక శక్తిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Also Reag:Eesha Rebba: హోటల్ బెడ్ పై ఈషా రెబ్బా టెంప్టింగ్ లుక్స్… అవకాశాల కోసం అందాలు ఎరవేస్తున్న తెలుగు బ్యూటీ!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular