ఏపీకొచ్చి మరీ జగన్ కు నిర్మల వార్నింగ్ ఇచ్చిందా?

ఓవైపు కేంద్రంలోని మోడీతో జగన్ ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఆయన కేబినెట్ లోని తెలుగు కోడలు నిర్మలతో మాత్రం జగన్ ఫైట్ చేస్తున్నాడు. ఇదేమీ రాజకీయమో తెలియక ఏపీ జనాలు ప్రతిపక్షాలు జుట్టుపీక్కుంటున్నాయి. మోడీతో జగన్ ఫ్రెండ్ షిప్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఖాతరు చేయడం లేదనుకుంటా.. అందుకే తాజాగా అమరావతిలో పర్యటించి జగన్ సర్కార్ కు కంటగింపుగా మారిందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గత 300 రోజులుగా మూడు రాజధానుల బిల్లుపై అమరావతి ప్రాంత […]

Written By: NARESH, Updated On : October 8, 2020 10:24 am
Follow us on


ఓవైపు కేంద్రంలోని మోడీతో జగన్ ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఆయన కేబినెట్ లోని తెలుగు కోడలు నిర్మలతో మాత్రం జగన్ ఫైట్ చేస్తున్నాడు. ఇదేమీ రాజకీయమో తెలియక ఏపీ జనాలు ప్రతిపక్షాలు జుట్టుపీక్కుంటున్నాయి. మోడీతో జగన్ ఫ్రెండ్ షిప్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఖాతరు చేయడం లేదనుకుంటా.. అందుకే తాజాగా అమరావతిలో పర్యటించి జగన్ సర్కార్ కు కంటగింపుగా మారిందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గత 300 రోజులుగా మూడు రాజధానుల బిల్లుపై అమరావతి ప్రాంత రైతులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం గన్నవరం సందర్శన ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

Also Read: హిందుత్వ లొల్లి: ఢిల్లీ నుంచి రాగానే జగన్ సీరియస్ నిర్ణయం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజయవాడలోని మారుమూల గ్రామాలను సందర్శించారు. అక్కడి రైతులు ఎదుర్కొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీలో పర్యటించడం విశేషంగా మారింది. నిర్మల సీతారామన్ గన్నవరం లోని జుక్కల నెక్కలం గ్రామంలో రైతులను కలుసుకున్నారు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల పంట దిగుబడికి కనీస మద్దతు ధర కల్పించడం.. మార్కెట్ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులపై, ప్రధానంగా వరి మరియు చెరకుపై కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆర్థిక మంత్రికి తెలియజేశారు. రైతులు వరిపై క్వింటాల్‌కు రూ .2,000 మద్దతు ధర కల్పించాలని.. పలు డిమాండ్లను నిర్మల ముందు పెట్టారు.

ఈ ప్రాంత గ్రామాల రైతులు అమరావతిలో రాష్ట్రానికి మూలధన అభివృద్ధి కోసం దాదాపు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పిఎస్) కింద విమానాశ్రయం అభివృద్ధి కోసం గన్నవరంలోని పలువురు రైతులు తమ భూములను ఇచ్చారు. నిర్మల సీతారామన్ గన్నవరం సందర్శన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమె పర్యటనలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడు పాల్గొనకపోవడం గమనార్హం. అంతకుముందు ఏపీ ప్రభుత్వం నిర్మల విమర్శలు గుప్పించడంతో ఈ పర్యటనకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సహజంగానే వైసీపీ పెద్దలు నిర్మల ఏపీ పర్యటనను వ్యతిరేకించారు. ఆమె కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి రైతులతో మాట్లాడడంతో బీజేపీ, వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఏపీలో మారింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ’ తెలియజేశారు. ఆమెతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్, ఎంఎల్‌సి పి వి ఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ఎవరూ ఈమె పర్యటన వైపు తొంగి చూడడం లేదు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక

చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన వివిధ ఒప్పందాలను రద్దు చేయడంపై పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గతంలో నిర్మల విమర్శించారు. ఒప్పందాలను రద్దు చేయడం దేశ పెట్టుబడి అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం తగదని నిర్మల అన్నారు. దాంతో నిర్మల పర్యటనకు సహజంగానే వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా సమావేశంలో ఏపీకొచ్చి మరీ రైతులను పరామర్శించడం జగన్ కు వార్నింగ్ ఇచ్చినట్టుగానే వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.