ఆంధ్రప్రదేశ్ లో జనసేన బలపడాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో పట్టు కోసం పరితపిస్తోంది. ఏ పార్టీ అయినా తూర్పు గోదావరి జిల్లాను లక్ష్యంగా చేసుకుని ఎదిగేందుకు పాటుపడుతుందని తెలుసుకుని అక్కడి నుంచే తన ఇమేజ్ పెంచుకోవాలని చూస్తోంది. దీంతో జనసేనకు పార్టీ అధ్యక్షుడిని సైతం నియమించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్టీఆర్ నుంచి వైఎస్ జగన్ వరకు అందరూ తూర్పు గోదావరి నుంచే రాజకీయాలు ఆరంభించి విజయం సాధించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఎక్కువ కాపు సామాజికవర్గమే ఉండడంతో జనసేన విస్తరణపై ఆశలు పెట్టుకుంది.
తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్ ను పవన్ కల్యాణ్ నియమించారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన దుర్గేష్ కు పగ్గాలు అప్పగించి జనసేన పార్టీని రాష్ర్టంలో ఎదగాలని చూస్తోంది. పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ను నియమించుకోవాల్సి ఉంది. దుర్గేష్ 2019లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు. ఓటమి చెందినా జగన్ వేవ్ లో 42 వేల ఓట్లు సాధించి తన పట్టు నిరూపించుకున్నారు. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించడం కరెక్టని పవన్ భావించారు. ప్రజారాజ్యం సమయం నుంచి కూడా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు.
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జత కడుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నా ఎక్కడ కూడా రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో పొత్తు విషయంలో జనసేన ఎటు వైపు ఉందో తెలియడం లేదు. ఇప్పటికే టీడీపీ సైతం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. బీజేపీకి టీడీపీకి పడని సందర్భంలో జనసేన వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. ఈ సమయంలో అధినేత పవన్ కల్యాణ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..
మరో వైపు ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ కూడా ఆందోళనలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి తన ప్రస్థానం ప్రారంభించానలి జనసేన భావిస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటే కనుక కందూరి దుర్గేష్ ఆధ్వర్యంలో జన సేన సంచనల విజయాలు సొంతం చేసుకుంటుందని అందరు భావిస్తున్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More