https://oktelugu.com/

KCR TRS: కేసీఆర్ కు కోవర్టుల భయం మొదలైందా?

KCR TRS:ఒక్క ఓటమి ఇప్పుడు గులాబీ పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. 2023లో తెలంగాణలో గెలుపు అంత ఈజీ కాదన్న వాస్తవాన్ని కళ్లకు కట్టింది. హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించినా ప్రత్యర్థి ఈటలరాజేందర్ ను ఓడించకపోవడం టీఆర్ఎస్ వర్గాన్ని నైరాశ్యానికి గురిచేసింది. అసంతృప్తులను బయటపడేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో అసమ్మతి మొదలైంది. కేసీఆర్ కు నమ్మిన బంటు అయిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరుగుబావుటా ఎగురవేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2021 / 05:25 PM IST
    Follow us on

    KCR TRS:ఒక్క ఓటమి ఇప్పుడు గులాబీ పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. 2023లో తెలంగాణలో గెలుపు అంత ఈజీ కాదన్న వాస్తవాన్ని కళ్లకు కట్టింది. హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించినా ప్రత్యర్థి ఈటలరాజేందర్ ను ఓడించకపోవడం టీఆర్ఎస్ వర్గాన్ని నైరాశ్యానికి గురిచేసింది. అసంతృప్తులను బయటపడేలా చేసింది.

    KCR (1)

    ఈ క్రమంలోనే తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో అసమ్మతి మొదలైంది. కేసీఆర్ కు నమ్మిన బంటు అయిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరుగుబావుటా ఎగురవేశారు. ఈటల రాజేందర్ మద్దతుతో ఎమ్మెల్సీగా పోటీచేస్తున్నారు. ఇక ఈటల రాజేందర్, రవీందర్ సింగ్ ఇద్దరూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తూ కొత్తగా కోవర్టులతో గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తన పరపతి అంతా ఉపయోగిస్తూ కోవర్టులతో టీఆర్ఎస్ కు గుబులు పుట్టిస్తున్నారు. సొంత పార్టీ నేతలే కీలక సమయంలో మాట మారుస్తూ బేరసారాలు చేస్తున్నారు. దీంతో తమ పార్టీ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు జిల్లా నేతలు అష్టకష్టాలు పడుతున్నారు.

    ఇలా కొనసాగితే ముఖ్యమంత్రి నుంచి ఎక్కడ చీవాట్లు తినాల్సి వస్తుందోనన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాలను వెంటాడుతోంది. తాజాగా స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ముందస్తు వ్యూహాలను రచించారు. హుజూరాబాద్ లో ఫ్లాప్ అయిన టీఆర్ఎస్ వ్యూహాలు ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేస్తాయా? లేదా? అన్నది వేచిచూడాలి.

    Also Read: కిషన్‌రెడ్డి మొగోనివైతే ధాన్యం ఎంతకొంటారో చెప్పాలి! తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్‌

    కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో కోవర్టుల ఆడియో ఒకటి బయటకి వచ్చింది. సొంత పార్టీ నేతలే హ్యాండిస్తున్నట్టు స్పష్టమవుతోంది. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.. దీనికి ఈటల రాజేందర్, రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కోవర్టులను ఆకర్షించేందుకు రెడీ అవుతున్నారట..

    టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేసి మరీ ఏదో ఒక రూపంలో మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ సీటులో టీఆర్ఎస్ కు గుబులు పుడుతోంది.

    Also Read: కేసీఆర్ లో భయం.. కరీంనగర్ ఎమ్మెల్సీ సీటు కోల్పోనుందా?