Sirivennela Seetharama Sastri: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందారు. న్యూమోనియా వ్యాధి కారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందారు. ఈరోజు ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి లోనైనా సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు.
ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్తతో చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా సీతారామ శాస్త్రి… 1955 మే 20 వ తేదీన జన్మించారు. ఆయన స్వస్థలం అనకాపల్లి. పదవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం అనకాపల్లి లోనే సాగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. ఆ తరువాత… చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట, లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల. లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
Also Read: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సిందూరం సినిమాలో ఆయన రాసిన అర్థ శతాబ్దపు పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా అందించారు సిరివెన్నెల. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. తెలుగు సినిమా ఒక దిగ్గజాన్ని కోల్పోయింది అని చెప్పాలి.
Also Read: కమల్ ఆరోగ్యంపై వైద్యులు స్పందన.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?