tdp
మీడియాను మేనేజ్ చేయడం.. మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం అంటే అది చంద్రబాబుకే చెల్లింది. ఒక విధంగా ఆయన నుంచి ఇది అలావాటు అయిందని కూడా చెప్పొచ్చు. అందుకే.. ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఓ వర్గం మీడియా ఆయన్ను కాదని వేరే వార్తలు పబ్లిష్ చేయవు. అలాంటి వార్తలు ప్రసారం కూడా కావు. అప్పుడప్పుడు ఏదో అడపాదడపా అన్నట్లు పబ్లిష్ చేస్తుంటారు. వందలో 90 శాతానికి పైగా జగన్ మీద వాటి అక్కసును వెల్లగక్కుతూనే ఉంటాయి. అంత నిబద్ధత కలిగిన ఆయన మీడియాను పొలిటికల్‌గా ‘ఎల్ల’ మీడియా అని పిలుస్తుంటారు.
అయితే.. ఇప్పుడు ఆ ‘ఎల్లో’ మీడియా ఎక్కడా చెప్పుకోలేని కష్టాలు వచ్చాయట. ఇన్నాళ్లు అడపాదడపా ప్రజల కోసం కొన్ని వార్తలు ప్రచురించినా.. ఇక నుంచి వాటిని కూడా ఉపసంహరించుకోవాలని చూస్తోంది. అందుకే.. ఈ మధ్య ప్రజాకోణంతో తమకు పనిలేదనట్టుగా వ్యవహరిస్తోందని పరిశీలికులు కూడా అంటున్నారు.
Also Read : కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!
బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న ఏపీలోనూ 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. 23 సీట్లకే పరిమితమైన బాబు కో నుంచి ఒక్కొక్కరుగా వైసీపీ బాట పడుతూనే ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ.. ఎన్నికల ప్రచారంలోనూ ఈ ‘ఎల్లో’ మీడియా జగన్ మీద ఎన్నో రకాల కట్టు‘కథలు’ అల్లింది. కానీ.. వాటిని ప్రజలు పెద్దగా ఖాతరు చేయలేదు.
ఇప్పుడు రానురాను టీడీపీ పరిస్థితి దారుణంగా తయారు కావడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వార్తలను.. ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని నిర్ణయించినట్లు చర్చ సాగుతోంది. ఒకప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే.. వారు వచ్చేముందు.. వారు వచ్చిన తర్వాత వార్తలను ఎల్లో మీడియా వండి వార్చేది. తర్వాత కాలంలో వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా చేసేది. జగన్‌పై దుమ్మెత్తి పోయించేది. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలు, నేతల విషయంలో నిన్నా మొన్నటి వరకు చిన్నపాటి వార్తలా కవర్ చేసినా.. ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పడేయాలని నిర్ణయించాయట.
ఇటీవల విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బాబు బ్యాచ్ నుంచి మరో ఎమ్మెల్యే బయటికి రావడం చర్చనీయాంశమైన వార్తే. కానీ.. బాబు అనుకూల మీడియా ఈ వార్తను పూర్తిగా కట్ చేసేసింది. అసలు తమకు తెలియదన్నట్టు వ్యవహరించింది. దీంతో మీడియా వర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : మోదీకి ట్వీటర్లో కేటీఆర్ కౌంటర్