బండి’ పాదయాత్రకు కిషన్ రెడ్డియే బ్రేక్ వేశాడా?

బీజేపీలో అంతర్గత కలహాలు పొడచూపుతున్నాయి. ఆధిపత్య ధోరణితో పార్టీని ఎదగనీయకుండా చేసే విధంగా చూస్తున్నారు. మాదంటే మాదే పెత్తనం కావాలని భావిస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఇందులో భాగంగాతెలంగాణలో బీజేపీకి తిరుగులేని ఇమేజ్ తీసుకురావాలని పాదయాత్ర చేయాలని భావించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంకల్పానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. పాదయాత్రకు అధిష్టానం నుంచి అనుమతి రాకుండా చేస్తున్నారు. దీంతో ఆయన ఆశయం కాస్త నీరుగారే ప్రమాదం ఉంది. పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈనెల […]

Written By: Srinivas, Updated On : August 1, 2021 11:26 am
Follow us on

బీజేపీలో అంతర్గత కలహాలు పొడచూపుతున్నాయి. ఆధిపత్య ధోరణితో పార్టీని ఎదగనీయకుండా చేసే విధంగా చూస్తున్నారు. మాదంటే మాదే పెత్తనం కావాలని భావిస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఇందులో భాగంగాతెలంగాణలో బీజేపీకి తిరుగులేని ఇమేజ్ తీసుకురావాలని పాదయాత్ర చేయాలని భావించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంకల్పానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది.

పాదయాత్రకు అధిష్టానం నుంచి అనుమతి రాకుండా చేస్తున్నారు. దీంతో ఆయన ఆశయం కాస్త నీరుగారే ప్రమాదం ఉంది. పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈనెల 9న పాదయాత్ర నిర్వహించాలని సంజయ్ ఇప్పటికే ప్రణాళిక ఖరారు చేసుకున్నా అది ఆచరణ సాధ్యం కాకుండా చూసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో బీజేపీకి క్రేజ్ రావాలని సంజయ్ సంకల్పించినా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా దానికి రూపం రాకుండా చేయడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా పదోన్నతి సాధించడంతో తెలంగాణలో అన్ని కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తాను కాకుండా మరొకరు హైలెట్ కావడం ఆయనకు ఇష్టం లేకనే పాదయాత్రకు అనుమతి రాకుండా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర తరహాలో ఇతర కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు స్టేట్ల బాధ్యతలను కిషన్ రెడ్డిపై పెట్టడంతోనే ఆయన పాదయాత్రపై కన్నేసి సాగకుండా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక బండి సంజయ్ కు ఇమేజ్ పెరిగింది. దీనికితోడు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జోరు పెరగడంతో ఎలాగైనా ఆయనకు చెక్ పెట్టాలని భావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రాకుండా చేయడంలో సఫలీకృతులైనట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా కిషన్ రెడ్డి బీజేపీ ప్రతిష్ట పెరగకుండా చేస్తున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి