https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: ‘దోస్తీ’ సాంగ్.. ఫ్యాన్స్ కు వైబ్రేషన్స్

దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి మూవీ తర్వాత విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మొదలైంది. రాంచరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ’ సాంగ్ ను ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాటను ఆయా భాషల్లో దక్షిణాదికి చెందిన ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు పాడడం విశేషం. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2021 / 11:25 AM IST
    Follow us on

    దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి మూవీ తర్వాత విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మొదలైంది.

    రాంచరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ’ సాంగ్ ను ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాటను ఆయా భాషల్లో దక్షిణాదికి చెందిన ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు పాడడం విశేషం.

    కీరవాణి సారథ్యంలో తెలుగులో దీన్ని గాయకుడు హేమచంద్ర పాడారు. హిందీలో అమిత్ త్రివేది, తమిళంలో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, కన్నడలో యాజిన్ నైజర్, మలయాళంలో విజయ్ ఏసుదాసు ఆలపించారు.

    మొత్తం ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువకెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు

    ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రధానంగా రాంచరణ్-ఎన్టీఆర్ స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించారు.అల్లూరి సీతారామారాజు, కొమురం భీంల స్నేహం సందర్భంగా సినిమాలో ఈ పాట వస్తుంది.

    దోస్తీ అంటూ కీరవాణి కంపోజ్ చేసిన ఈ ప్యాన్ ఇండియా పాట అభిమానుల గుండెల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. రాజమౌళి ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే ఇప్పటికే హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు కీరవాణి ‘దోస్తీ’పాటతో మరో స్తాయికి తీసుకెళ్లారని చెప్పొచ్చు.