కేసీఆర్, జగన్ ల ఫోన్లు.. ట్యాప్ అయ్యాయా?

దేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమ్ము రేగుతోంది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఈనేపథ్యంలో తెలుగు స్టేట్ల సీఎంల ఫోన్లు సైతం హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచడం పరిపాటే. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా చూసుకునే వెసులుబాటు ఉంటుందనేది తెలిసిందే. దీంతో పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దేశంలోని శాస్ర్తవేత్తలు, జడ్జీలు, జర్నలిస్టులు, కార్పొరేట్ […]

Written By: Raghava Rao Gara, Updated On : July 24, 2021 5:43 pm
Follow us on

దేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమ్ము రేగుతోంది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఈనేపథ్యంలో తెలుగు స్టేట్ల సీఎంల ఫోన్లు సైతం హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచడం పరిపాటే. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా చూసుకునే వెసులుబాటు ఉంటుందనేది తెలిసిందే. దీంతో పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

దేశంలోని శాస్ర్తవేత్తలు, జడ్జీలు, జర్నలిస్టులు, కార్పొరేట్ కంపెనీల చైర్మన్లతో పాటు చాలా మంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇన్ని రోజులుగా పార్లమెంట్లో ఇదే విషయమై గందరగోళం జరుగుతోంది. గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం పెదవి విప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుమారు లక్ష మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన పేర్లు మాత్రం 400 వరకు ఉంటాయని సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ పై ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని చెప్పడం గమనార్హం. ఇంకా కొన్ని వేల మంది వరకు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజురోజుకు బాధితుల పేర్లు పెరుగుతండడంపై ఆందోళన కలుగుతోంది.

దీంతో తెలుగు స్టేట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వీరితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ప్రచారం సాగుతోంది. విదేశీ సాంకేతిక సహకారంతో వ్యక్తులకు తెలియకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేసే విధానం ఉందని తెలిసిందే. దీంతోనే ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల వ్యూహాలను పసిగడుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.