లాక్ డౌన్ వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. మాకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్చ కావాలి అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ఫ్రీడమ్, వేకప్ ఆస్ట్రేలియా అంటూ నినాదాలు చేశారు. తమ నిరసనను స్వేచ్ఛా ర్యాలీగా పేర్కొన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సిడ్నీలో కొందరు నిరసనకారులు పెకలించిన మొక్కలు, బాటిల్స్ ను పోలీసులపైకి విసిరారు. నిరసనలో పాల్గొన్న చాలా మంది […]
లాక్ డౌన్ వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. మాకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్చ కావాలి అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ఫ్రీడమ్, వేకప్ ఆస్ట్రేలియా అంటూ నినాదాలు చేశారు. తమ నిరసనను స్వేచ్ఛా ర్యాలీగా పేర్కొన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సిడ్నీలో కొందరు నిరసనకారులు పెకలించిన మొక్కలు, బాటిల్స్ ను పోలీసులపైకి విసిరారు. నిరసనలో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.