https://oktelugu.com/

Janasena Chief Pawan Kalyan: ఆ నేతలను పవన్ టార్గెట్ చేశారా?

Janasena Chief Pawan Kalyan: ఏపీలో జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. కానీ పవర్ రాజకీయాలకు పవన్ ఇన్నాళ్లూ దూరంగా ఉంటూ వచ్చారు. దానినే అలుసుగా తీసుకొని రాజకీయ ప్రత్యర్థులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వారంతా గతంలో పవన్ తో సాన్నిహిత్యంగా ఉన్నవారే. పవన్ నుంచి లబ్ధి పొందిన వారే. కానీ రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన వారంతా పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. […]

Written By:
  • Dharma
  • , Updated On : September 21, 2022 / 12:39 PM IST
    Follow us on

    Janasena Chief Pawan Kalyan: ఏపీలో జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. కానీ పవర్ రాజకీయాలకు పవన్ ఇన్నాళ్లూ దూరంగా ఉంటూ వచ్చారు. దానినే అలుసుగా తీసుకొని రాజకీయ ప్రత్యర్థులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వారంతా గతంలో పవన్ తో సాన్నిహిత్యంగా ఉన్నవారే. పవన్ నుంచి లబ్ధి పొందిన వారే. కానీ రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన వారంతా పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగుతున్నారు. అయినా అన్నీ భరిస్తూ వచ్చిన పవన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వచ్చేఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని చెబుతున్న పవన్.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారిని రాజకీయంగా దెబ్బతీయ్యాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న వారికి సరైన సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పతనం ప్రారంభమైంది…45 స్థానాలకు మించి రావని సర్వేల నివేదిక అందుకున్న పవన్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గాల సమీక్షలకు శ్రీకారం చుట్టారు.

    Janasena Chief Pawan Kalyan

    అయితే నియోజకవర్గాల సమీక్ష ప్రారంభానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఈయన మాజీ మంత్రి కూడా. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీఆర్పీ 18 స్థానాలు వస్తే అందులో వెల్లంపల్లి గెలుపొందిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఉంది. పీఆర్పీ సమయంలో ఆయన పవన్ తో సన్నిహితంగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో వెల్లంపల్లి బీజేపీ తరుపున పోటీచేశారు. అప్పటికే జనసేన ఆవిర్భవించినా.. పవన్ మాత్రం టీడీపీ, బీజేపీలకు మద్దతు ప్రకటించారు. అయితే పవన్ ను తన తరుపున ప్రచారానికి రావాలని వెల్లంపల్లి కోరిన వీడియో దృశ్యాలను ఇటీవల జన సైనికులు వైరల్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన వెల్లంపల్లి బీజేపీని వీడి వైసీపీ లో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఎంపికయ్యారు. అప్పటి నుంచి పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. వ్యక్తిగత విమర్శలు చేసేవారు. బీజేపీ అభ్యర్థిగా తనకు మద్దతు ప్రచారం చేయమని పవన్ ను కోరిన విషయం మరిచిపోయి.. అంత సీన్ ఉంటే పవన్ రెండుచోట్ల ఎందుకు ఓడిపోతారంటూ ఎద్దేవా చేశారు. ఇది పవన్ కు బాధించినా.. ఎక్కడా బయటపడలేదు. కానీ ప్రస్తుతం అమాత్య పదవి పోయిన వెల్లంపల్లి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే అక్కడ జనసేన ను యాక్టవ్ చేసి వెల్లంపల్లిని రాజకీయంగా దెబ్బ కొట్టాలని పవన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

    Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే?

    Janasena Chief Pawan Kalyan

    2014లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన వెల్లంపల్లి 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి 22 వేల ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 50 వేల ఓట్లు రాగా… జనసేన అభ్యర్థికి 22 వేల ఓట్లు వచ్చాయి.. జనసేన రెబల్ అభ్యర్థి 12 వేల ఓట్లు దక్కించుకున్నాడు. దీంతో వెల్లంపల్లికి సునాయాస విజయం దక్కింది. ఈ సారి టీడీపీతో పొత్తు ఉన్నా.. లేకున్నా.. వెల్లంపల్లిని మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదన్న కసితో పవన్ పనిచేస్తున్నారు. అందుకే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జన సైనికులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. కొద్ది నెలలనుంచే సన్నాహాలు ప్రారంభించిన బస్సు యాత్రను వాయిదా వేసి మరీ.. నియోజకవర్గాల సమీక్షలకు దిగిన పవన్.. ఒకప్పటి తన సన్నిహిత నేతలు, ప్రస్తుతం తనను టార్గెట్ చేసిన నాయకులపై ఫోకస్ పెంచారు. వారి నియోజకవర్గాల సమీక్షలకు ప్రాధాన్యమిస్తున్నారు.

    Also Read: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్‌.. కేసీఆర్‌ నిర్ణయం నిరుద్యోగులకు శాపం! 

    Recommended videos:

    Tags