వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సోమనూర్ ప్రాంతంలో శ్రీనివాసన్, గంగాదేవి(37) దంపతులు కాపురం చేసుకుంటున్నారు. శ్రీనివాసన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గంగాదేవి అలియాస్ దేవి సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుకుంటానని భర్తకు చెప్పింది. దీంతో ఆయన కూడా సరే అని అన్నాడు.దీంతో పెద్ద మొత్తంలో బ్యూటీపార్లర్ షాప్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమంలో కాలం గడిపే గంగాదేవికి ఫేస్ బుక్ లో మధురై జిల్లా కామరాజ్ నగర్ కు చెందిన ముత్తుపాండి (41) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు బాగా దగ్గరయ్యారు. భార్యను వదిలేసి ఒంటరిగా ఉన్న ముత్తుపాండి దేవిని బాగా ఆకర్షించాడు.
సెక్స్ కోరికలు బాగా ఉన్న దేవి తన బ్యూటీపార్లర్ నే బెడ్ రూంగా మార్చి ముత్తుపాండితో సహజీవనం చేసింది. అయినా కోరిక తీరక ఇద్దరు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్తకు దూరంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా ఓ నాటకం ఆడాలని భావించారు. ఓ రోజు తన బ్యూటీపార్లర్ నుంచి భార్య ఎంతకీ రాకపోవడంతో భర్త శ్రీనివాసన్ బ్యూటీపార్లర్ కు వెళ్లేసరికి నిర్ఘాంతపోయాడు. భార్య దేవి అర్థనగ్నంగా కట్టేసి ఉంది. దీంతో భార్యను ఇంటికి తీసుకెళ్లిన భర్త ఏం జరిగిందని అడిగాడు. తన షాప్ లోకి ముగ్గురు వ్యక్తులు వచ్చి నగలు, డబ్బు దోచుకెళ్లి తనపై లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు.
పోలీసులు వేసిన ప్రశ్నలకు దేవి తటపటాయించింది. గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయడంతో సమాధానం చెప్పలేక పోయింది. దీంతో తన అక్రమ సంబంధం విషయం ఎక్కడ బయటపడుతుందోనని బెంగా పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిస్తే దారుణం జరుగుతుందని భావించి తనువు చాలించాలని భావించి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు ఆమె కాల్ డాటా పరిశీలించగా ఆసక్తి కర విషయాలు వెలుగు చూశాయి. ముత్తుపాండి బాగోతం బయటపడింది. గంటల కొద్ది మాట్లాడుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవితాన్ని సక్రమంగా దిద్దుకుంటే నూరేళ్లు ఉంటుంది. అదే తప్పుదారిలో పోతే అంతే సంగతి. నిండు నూరేళ్లు భర్తతో కలిసి జీవించాల్సిన దేవి అర్థంతరంగా తనువు చాలించడంలో ఆమె కోరికలే ప్రధాన పాత్ర పోషించాయి. నాలుగు రోజుల సుఖం కోసం కట్టుకున్న వాడినే మోసం చేసి తను సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎప్పటికైనా రాజమార్గమే సురక్ష. దొడ్డి మార్గం ఎప్పటికి ప్రమాదమే అని గుర్తించాలి. లేదంటే జీవితం తలకిందులైపోతుంది. సగం జీవితం సంకనాకిపోతుందని గుర్తుంచుకోవాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.