Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan on PRC: ఉద్యోగులను పీఆర్సీపై సీఎం జగన్ బెదిరించాడా? బతిమాలాడా?

CM Jagan on PRC: ఉద్యోగులను పీఆర్సీపై సీఎం జగన్ బెదిరించాడా? బతిమాలాడా?

CM Jagan on PRC: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఆర్సీపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ, పీఆర్సీ విషయమై ఇంకా చర్చల దశ కొనసాగుతోంది. పీఆర్సీ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు., పెన్షనర్లకు మరో రెండు లేదా మూడు రోజుల పాటు వెయిట్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఉద్యోగ సంఘాలను సీఎంతో చర్చలకు ఆహ్వానించడంతో ఈ రోజే కచ్చితంగా పీఆర్సీ పైన అనౌన్స్ మెంట్ ఉంటుందని అందరూ అంచనా వేసుకున్నారు. కొందరు అయితే పీఆర్సీ రాబోతున్నదని ఆనందపడిపోయారు కూడా. కానీ, అటువంటి ప్రకటన అయితే రాలేదు. ఉద్యోగ సంఘాల నేతల సమావేశాలపైన అధికారుల నుంచి ముందుగానే పూర్తి సమాచారం తీసుకున్న సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతోనూ చర్చించినట్లు టాక్.

CM Jagan on PRC
CM Jagan on PRC

ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడే క్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలను పూర్తి సానుకూల ఆలోచనతో పరిష్కరిస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని సూచించారు.

Also Read: జగన్ బాటలోనే విపక్షాలు.. బలమైన ‘ప్రతి’ వ్యూహాలు..

రాష్ట్రం మోయలేని భారాన్ని వేయొద్దని కోరినట్లు టాక్. అయితే, ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను అన్నిటినీ జగన్ పూర్తిగా విన్నారట. ఇప్పటికే అమలు చేస్తున్న 27 శాతం ఐఆర్ గురించి చెప్పుకొచ్చారు. ఆర్థికంగా కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వ మని చెబుతూ..తమ పథకాల అమలు, పాలనలో ఉద్యోగులు కీలకమని తెలిపారు.

మొత్తంగా ఉద్యోగుల పీఆర్సీపైన జగన్ బతిమాలాడటంతో పాటు బెదిరించే వైఖరిని అవలంభించారా అని పలువురు చర్చించుకుంటున్నారు. పీఆర్సీ పైన అధ్యయనం చేసిన సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. కాగా, తమకు 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రకటించిన 30 శాతం కంటే అధికంగా ఫిట్ మెంట్ సీఎం జగన్ ఇస్తారని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

Also Read: ఆ పనులు పూర్తి చేసే దిశగా జగన్.. బాబుకు విమర్శించే ఛాన్స్ ఇవ్వరా..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular