ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ వైఖరిపై వైసీపీ సవాల్ విసురుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని సైకిల్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే 6 లక్షల ఇళ్లు నిర్మించామని చెబుతున్న ఆ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, ఒకవేళ పూర్తి చేసినట్లు నిరూపిస్తే తప్పకుండా లబ్ధిదారులకు పంపిణి చేస్తామని వైసీపీ చెబుతోంది. దీనిపై నిజనిజాలేంటో తెలియక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించామని, వాటిని సంక్రాంతిలోగా లబ్ధిదారులకు చేర్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే ఆ ఇళ్లను తామే ఆక్రమించుకుంటామని హెచ్చరిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ‘టిడ్కో’ ఆధ్వర్యంలో నిర్మించిన అపార్టుమెంట్లు, పైపైన రంగులతో కనిపిస్తున్నా లోపల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచాయని వైసీపీ అంటోంది. చంద్రబాబు తాను అధికారంలోకి దిగేసరికి రూ. 3,200 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉంచారని, వాటిని తమ ప్రభుత్వమే తీరుస్తోందని వైసీపీ చెబుతోంది.
Also Read: పోలవరం ఇంకో ‘ప్రత్యేక హోదా’ లాగా మారబోతుందా?
టీడీపీ అధికారంలో ఉండగా కేంద్రం 7 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. అందులో 3 లక్షల ఇల్లు కేవలం పునాది వరకే నిర్మాణాలు జరిగాయి. 2.5 లక్షల ఇళ్లు బేసిమెంట్ స్థాయివరకే ఆగాయి. అయితే లబ్ధిదారులతో నిర్మాణం పూర్తికాకముందే గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు ఆ తరువాత వాటిని పూర్తిగా నిర్మించలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా 20 శాతం పనులు మిగిలి ఉన్న ఇళ్లు 81వేలు. అంటే 6 లక్షల ఇళ్లలో ఇవి మాత్రమే కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.
Also Read: ఏపీలో స్కూల్స్ రెడీ.. క్లాసులు ఇలా నిర్వహిస్తారు.?
టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా అపార్టుమెంట్ల లేఅవుట్‌లు మాత్రమే చూపిస్తున్నారని, లోపల జరిగిన పనులు చూపిస్తే అసలు బండారం బయటపడుతుందని అంటున్నారు. నిజానికి చంద్రబాబు 6 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఉంటే తన మీడియాను తీసుకెళ్లి చూపించవచ్చు గదా అని పేర్కొంటున్నారు. సంక్రాంతి వరకు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని అంటున్న టీడీపీ, వైసీపీ విసురుతున్న సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.