పోలీసులకు సవాల్‌గా మారిన మిస్సింగ్‌ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్‌ కేసులు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజురోజుకు ఈ కేసులు ఎక్కువ కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. డబ్బు కోసం కొందరు,మరికొన్ని కారణాలతో అదృశ్యమవతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసు అధికార వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. వీటిలో ఇటీవల బుధవారం ఒక్కరోజే 65 మంది వ్యక్తులు అదృశ్యమయ్యారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ మిస్సింగ్‌ కేసులు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల శామిర్‌పేట […]

Written By: NARESH, Updated On : October 30, 2020 8:39 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్‌ కేసులు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజురోజుకు ఈ కేసులు ఎక్కువ కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. డబ్బు కోసం కొందరు,మరికొన్ని కారణాలతో అదృశ్యమవతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసు అధికార వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. వీటిలో ఇటీవల బుధవారం ఒక్కరోజే 65 మంది వ్యక్తులు అదృశ్యమయ్యారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

మిస్సింగ్‌ కేసులు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల శామిర్‌పేట మిస్సింగ్‌ ఉదంతం తరువాత పోలీసులు అలెర్టయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా ఎక్కువగా అదృశ్య కేసులు నమోదవుతున్నాయని ఆరా తీశారు. గత బుధవారం హైదరాబాద్‌ పోలిస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 మంది, సైబరాబాద్‌ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Also Read: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి శుభవార్త..

ప్రతీ ఏడాది జరిగే మిస్సింగ్‌ కేసుల్లో 80 శాతం పరిష్కరిస్తున్న మిగతా శాతం కేసులు అలాగే ఉండిపోతుఆన్నయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో 3418 కేసలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిలో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. అయితే ఇలా పెండింగ్‌ కేసులున్న సీఐడీకి ట్రాన్స్‌ఫర్‌ తప్పడం లేదు.

Also Read: ప్రజలకు అలెర్ట్: సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా

ఈ ఏడాది మిస్సింగ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంఇ. ఇందులో భాగంగానే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ఉంచారు. ముఖ్యంగా ఈనెల 26న 65, 27న 62, 28న 65 , 29న 11 మిస్సింగ్‌ కేసులు నమోదవడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈనెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1282 కేసులు నమోదయ్యాయి. అయితే దర్పణ్‌ యాప్‌తో పోలీసులు ట్రేస్‌ చేస్తున్నా.. కొన్నింటి ఆచూకీ మాత్రం లభించడం లేదు.