Bjp Politics: ఉప ఎన్నికల్లో ఇచ్చిన షాక్ తోనే బీజేపీ తేరుకుందా?

Bjp Politicis:దేశవ్యాప్తంగా దీపావళి పండుగ కానుక అంటూ బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేసింది. ఎక్సైజ్ సుంకం తగ్గించేసి ఆ తగ్గింపును ప్రజలకు పంచేసింది. ఇక రాష్ట్రాలనూ మీరు తగ్గించాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి షాకిచ్చాయి. దీంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాలు అధికార పార్టీలను బీజేపీ టార్గెట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయా రాష్ట్రాలు ఎందుకు వ్యాట్ తగ్గించలేదనే […]

Written By: NARESH, Updated On : November 5, 2021 6:03 pm
Follow us on

Bjp Politicis:దేశవ్యాప్తంగా దీపావళి పండుగ కానుక అంటూ బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేసింది. ఎక్సైజ్ సుంకం తగ్గించేసి ఆ తగ్గింపును ప్రజలకు పంచేసింది. ఇక రాష్ట్రాలనూ మీరు తగ్గించాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి షాకిచ్చాయి. దీంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాలు అధికార పార్టీలను బీజేపీ టార్గెట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయా రాష్ట్రాలు ఎందుకు వ్యాట్ తగ్గించలేదనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

modi. petrol prices

ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గకపోవడంతో వినియోగదారుల్లో ఫస్ట్రేషన్ పెరుగుతోంది. కేంద్రం కోరినా బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఈ సూచనలు పట్టించుకోలేదు. దీంతో దీపావళి కానుక పేరుతో ఎక్సైజ్ సుంకం తగ్గించి రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు బీజేపీయేతర పార్టీల్లో కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు సైతం కేంద్రం సూచన పట్టించుకోకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇన్నాళ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు అన్ని రాష్ట్రాలు, ప్రజలు చమురు ధరలు తగ్గించాలని పలుమార్లు డిమాండ్లు చేస్తున్నా పట్టించుకోని బీజేపీ.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలేసరికి వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెట్రో ధరలను అమాంతం తగ్గించేసిందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ఆ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. దీంతో వ్యాట్ తగ్గించండంటూ రాష్ట్రాలపై నెపం వేసి మోడీ సర్కార్ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

బీజేపీకే మొత్తం పెట్రో ధరల క్రెడిట్ దక్కుతుందని భావిస్తున్న రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే తమకు లాభం లేకపోగా నష్టమని భావిస్తున్నాయి. అందుకే తగ్గించడం లేదు. బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. చివరకు బీజేపీ యేతర పార్టీల్లో కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు సైతం కేంద్రం సూచనను పట్టించుకోకపోవడం ఇప్పుడు సంచలనమవుతోంది.