https://oktelugu.com/

Actor Surya: పునీత్ సమాధి వద్ద హీరో సూర్య ఏం చేశాడో తెలుసా…

Actor Surya: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణించి 7 రోజులు కావస్తున్న కర్ణాటకలో మాత్రం ఇంకా విషాద ఛాయలు అలుముకునే ఉన్నాయి. పునీత్ లేని లోటు కన్నడ చిత్ర పరిశ్రమకె కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తానికి తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నటనతో మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు పునీత్. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 05:48 PM IST
    Follow us on

    Actor Surya: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణించి 7 రోజులు కావస్తున్న కర్ణాటకలో మాత్రం ఇంకా విషాద ఛాయలు అలుముకునే ఉన్నాయి. పునీత్ లేని లోటు కన్నడ చిత్ర పరిశ్రమకె కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తానికి తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నటనతో మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు పునీత్. ఆయన మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా ఈరోజు హీరో సూర్య పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    ఈ మేరకు పునీత్  అన్న శివరాజ్ కుమార్ తో కలిసి… పునీత్ సమాధి వద్దకు వెళ్లారు. అనంతరం ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సూర్య. ఈ సందర్భంగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. సూర్య బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించగా… ఈరోజు నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా పునీత్ ఇంటికి చేరుకొని వారిని ఓదార్చారు.