https://oktelugu.com/

AP Special Status: ఆంధ్రులకు ‘ప్రత్యేక హోదా’ వచ్చినట్లేనా..? అంతలోనే ట్విస్ట్

AP Special Status: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు అవుతోంది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సమస్యలు పరిష్కరించకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విభజనతో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నష్టం జరిగిందని అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడిన తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడల్లా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2022 / 10:33 AM IST
    Follow us on

    AP Special Status: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు అవుతోంది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సమస్యలు పరిష్కరించకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విభజనతో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నష్టం జరిగిందని అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడిన తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడల్లా విభజన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కానీ దానికి మార్గం చూపలేదు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2019 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ డిమాండ్ చేసింది. ఒక దశలో ఏపీకి ప్రత్యేక హోదానే తమ నినాదంగా ప్రజల్లోకి వెళ్లింది. ఏడేళ్ల తరువాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన సమస్యల పరిష్కారానికి ఈనెల 17న సమావేశానికి రావాలని రెండు రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది.

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా విభజించి పాలించి దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విభజన సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే రెండు రాష్ట్రాలను విభజించడంలో సరైన పద్ధతులు పాటించలేదని మోదీ అన్నారు. అయితే దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన మంద్రి మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సక్రమంగా విభజించలేదు సరే.. మరి ఏడేళ్లుగా మోదీ అధికారంలో ఉండి ఏం చేశారు..? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

    ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల సీఎస్ లను ఈనెల 17న సమావేశాలకు రావాలని కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయితే ఇందులో ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఉంచడంపై ఏపీ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాష్ట్రాలుగా అవతరించిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ ఉంది. 2014 నుంచి వైసీపీ ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పలు ఆందోళనలు చేసింది. అంతేకాకుండా 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా మా హక్కు అంటుూ నినదించారు.

    అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కలుస్తూ వస్తోంది. అయితే కొన్ని రోజుల తరువాత ఈ విషయాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పట్టించుకోలేదు. కానీ కేంద్రం తాజాగా అనూహ్యంగా విభజన సమస్యలపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల సీఎలను పిలవడం ఆశ్చర్యకంగా మారింది. అయితే ఇప్పటికే కేంద్రంపై అగ్గి రాజేస్తున్న కేసీఆర్ ఈ సమావేశానికి హజరవుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం హాజరు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఆంధ్రులకు కేంద్రం జారీ చేసిన లేఖలో ‘ప్రత్యేక హోదా’ అంశం ఉండడంతో సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సమావేశాల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని రెండు రాష్ట్రాలు.. ముఖ్యంగా ఏపీ వాసులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే తమ బాధలు ఇక తీరినట్లేనని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.