Sunrisers Hyderabad: మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా మన సన్ రైజర్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉందండోయ్. అయితే సన్ రైజర్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది డేవిడ్ వార్నర్ పేరు. సన్ రైజర్స్ ఖాతాలో ఐపీఎల్ ట్రోఫీ పడిందంటే ఇందుకు కారణం అతనే. సింగిల్ హ్యాండ్‌తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. తన కెప్టెన్సీలో జట్టును ఎన్నో విజయ తీరాలకు చేర్చిన ఘనత వార్నర్‌కే ఉంది.
కాగా గత సీజన్ నుంచి సడెన్‌గా వార్నర్ నుంచి జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కాగా ఈసారి ఏకంగా జట్టు నుంచే వదులుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పటి దాకా సన్ రైజర్స్ ఖాతాలో ఒకే ఒక్క ట్రోఫీ ఉంది. అది కూడా వార్నర్ తీసుకు వచ్చిందే. అంత చేసిన వార్నర్‌ను దూరం పెట్టడమే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
Also Read: రూ.160 డిపాజిట్ తో రూ.10 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?
నిన్న జరిగిన మెగా వేలంలో వార్నర్‌ను సన్ రైజర్స్ వదులుకుంది. ఒక్క వార్నర్‌నే కాకుండా మిగతా టాప్ ప్లేయర్లందరినీ వదులుకుంది హైదరాబాద్. తెలుగు ప్లేయర్లను కొనేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వార్నర్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. అది చాలా తక్కువ ప్రైస్ మనీతో.
కానీ అభిసేక్ శర్మ కోసం రూ.6.50 కోట్లు ఖర్చు చేసింది సన్ రైజర్స్. అంటే వార్నర్ కంటే అభిషేక్ అంత గొప్ప ఆటగాడా అనే వాదన బయటి నుంచి వినిపిస్తోంది. అతని కోసం పెట్టిన దాని కంటే తక్కువకే వార్నర్ ఉన్నాడు కదా. మరి అంత కూడా పెట్టకపోవడమేంటి అని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు హైదరాబాద్ మేనేజ్ మెంట్ మీద. ఇతరుల కోసం అంత ఖర్చు పెట్టిన హైదరాబాద్.. టీమ్‌కు ఎనలేని ఖ్యాతిని తీసుకు వచ్చిన వార్నర్‌ను ఇలా అవమానించడమేంటని మండిపడుతున్నారు క్రికెట్ లవర్స్. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి.
Also Read: ప్రత్యేక హోదా పక్కన పెట్టడంలో చంద్రబాబు పాత్ర ఉందా?