KCR Song – Dheklenge : ‘‘ఔర్ ఏక్ దక్కా కేసీఆర్ పక్కా.. తొడగొట్టి చెప్పుతున్న ఎవడొస్తడొ రండిర బై.. దేఖ్లేంగే’’ ఈ లిరిక్స్‌తో వచ్చిన ఓ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని షేక్ చేస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పాటను రూపొందించారు. ప్రచార సభల్లో ఈ పాటకు ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సైతం స్టెప్పులేయడం గమనార్హం. సాంగ్ సూపర్.. ఐ లవ్ దిస్ సాంగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ అభివృద్ధి, సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత గురించి నాలుగు నిమిషాల్లో చాలా చక్కగా వివరించాడు రైటర్.
హిమాన్షు ఇన్‌ష్టా ప్రచారం..
ఆకట్టుకునే పాటలు.. అలరించే ర్యాప్ గీతాలు.. పదునైన సందేశాలు.. పంచ్ డైలాగులు.. మ్యూజిక్ మ్యాజిక్.. మిక్స్ చేసి, తాత కేసీఆర్‌కు మద్దతుగా కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు ఆన్‌లైన్‌లో ప్రచారం సాగిస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో కూడా మళ్లీ కేసీఆరే గెలుస్తారని బల్లగుద్ది చెబుతున్నాడు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన హిమాన్షు.. తాత కేసీఆర్ కోసం సోషల్ మీడియా వేదికగా బీఆర్‌ఎస్ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. ఇందుకోసం పార్టీ సిద్ధం చేసిన పలు పాటలతోపాటు కొన్ని ర్యాప్ సాంగ్స్‌ను కూడా హిమాన్షు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ‘ఔర్ ఏక్ ధక్కా.. కేసీఆర్ పక్కా.. గల్ల ఎత్తి చెబుతున్నా.. తొడగొట్టి చెబుతున్నా.. గొంతెత్తి చెబుతున్నా.. ఎవడొస్తడొ రండిరబై.. దేఖ్‌లేంగే.. ఎత్తిన జెండా దించను.. కారు గుర్తుకు ఓటెస్తా.. ఎవడొస్తడొ రండిరబై.. దేఖ్‌లేంగే’ అనే పాటతో చాలెంజ్ విసురుతున్నాడీ కల్వకుంట్లవారి నవ నాయకుడు.
గేమ్ ఆన్ ట్యాగ్‌లైన్‌తో..
‘గేమ్ ఆన్’ అనే ట్యాగ్‌లైన్‌తో కేసీఆర్, కేటీఆర్ సభల్లో పాల్గొనేందుకు వెళ్లే ఓ వీడియోను కూడా ఇటీవల తన ఖాతాలో అప్‌లోడ్ చేశారు హిమాన్షు. దీంతోపాటు ‘ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో గెలవబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. ఎవ్వరూ ఆపలేరు.. ఎవరి తాత, జేజమ్మ వశం కాదు’ అని చెప్పే కేసీఆర్ వ్యాఖ్యలను కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో కలిపి పోస్ట్ చేశాడు. అంతేకాదు ‘బాస్ ఈజ్ బ్యాక్‘.. అనే ట్యాగ్‌లైన్‌తో.. ‘నవంబర్ 30న దుమ్ము రేగాలె.. మళ్ల బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి రావాలె’ అనే కేసీఆర్ వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు.
ప్రచారానికే ప్రాధాన్యం..
ఇలా ఒకటి, రెండు కాదు.. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ రూపొందించే ప్రతీ వీడియో సందేశాలు, పాటలు, పలు పంచ్ డైలాగ్‌లతో కూడిన వీడియోలను ఎప్పటికప్పుడు తన ఖాతాలో అప్‌లోడ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాడు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ కూడా పార్టీ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో.. ‘తాతకు తగ్గ మనుమడు’ అంటూ తాతా మనవళ్ల అనుబంధం గొప్పగా ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ నుండి ఎవడొస్తడో రండి బై
చల్ దేఖ్ లేంగే
ఔర్ ఎక్ దక్కా… కేసీఆర్ పక్కా #KCROnceAgain #VoteForCar #Dekhlenge
Link : https://t.co/r86UvN3U1g pic.twitter.com/g4DlvVKEvo
— BRS Party (@BRSparty) November 6, 2023
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Dhekhlenge kcrs swinging song video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com