https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌కూ ధరణి సమస్య.. సీఎం పాస్‌బుక్‌లోనూ పొరపాట్లు

రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులను ట్రిబ్యునళ్లకు అప్పగించి, ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ట్రిబ్యునళ్లు సివిల్‌ కోర్టులకే పొమ్మంటూ ఉచిత సలహాలను ఇస్తుండటంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 11, 2023 / 11:09 AM IST
    CM KCR

    CM KCR

    Follow us on

    CM KCR: ‘‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తరట.. ధరణిని పడేస్తే మరి రైతుబంధు ఎట్ల వస్తది.. ధరణిపోతే.. మళ్లీ దళారులదే రాజ్యం.. పటేళ్లు, పట్వారీలు వస్తురు. ఏం కావాలన్నా పైసలు అడుగుతరు.. ధరణితో భూమి పెత్తనం మీ బొటన వేలుకు ఇచ్చినం. ముఖ్యమంత్రి కూడా మీ భూములను ముట్టుకోడు’’ ఇదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేస్తున్న విమర్శలు. ధరణి పోర్టల్‌ గురించి మస్తు గొప్పలు చెప్పే కేసీఆర్‌ సాక్షాత్తూ తన వివరాలే తప్పుగా ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు ఇదే విషయం కాంగ్రెస్‌కు అస్త్రంగా మారింది. ధరణితో వేల ఎకరాల భూములను కేసీఆర్‌ దోచుకున్నాడని, అసైన్డ్‌ భూములను లాక్కున్నాడని కాంగ్రెస్‌ అరోపిస్తోంది. ఇప్పటికీ వేల మంది ధరణి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం ధరణి మించింది లేదని చెబుతున్నారు. తన వరకు వస్తే కానీ తెలియదు అన్నట్లు.. ఎన్నికల సమయంలో నామినేషన వేసిన కేసీఆర్‌ ధరణితో తనకూ సమస్య ఉన్నట్లు పేర్కొన్నడమే కొసమెరు.

    సమస్యలు.. సవాలక్ష..
    ధరణిలో సమస్యలు.. సవాలక్ష ఉన్నాయి. యంత్రాగానికే అవగాహన లేదు.. కొన్ని సమస్యలు యథాతథంగానే ధరణి పోర్టల్‌తో కొత్త ఇబ్బందులు వివరాల్లో తప్పులతో విక్రయానికీ వీల్లేదు పరిష్కారాల్లేని పార్ట్‌ బీ సమస్యలు గతంలో భూ రికార్డుల, భూ సరిహద్దులు, ఇతర ఏ విధమైన వివాదం వచ్చినా మండల, డివిజన్, జాయింట్‌ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఉండేవి. ఏదో ఒక కోర్టులో రైతుకు న్యాయం జరిగేది. రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను కేసీఆర్‌ రద్దు చేశారు. దీంతో రైతుకు న్యాయం దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఏ చిన్న వివాదం వచ్చినా సివిల్‌ కోర్టులకు పోవాల్సి వస్తున్నది.

    ట్రిబ్యునళ్లు నామమాత్రమే..
    రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులను ట్రిబ్యునళ్లకు అప్పగించి, ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ట్రిబ్యునళ్లు సివిల్‌ కోర్టులకే పొమ్మంటూ ఉచిత సలహాలను ఇస్తుండటంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా కేంద్రంలో శాశ్వత రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. తర్వాత విస్మరించింది. రాష్ట్రంలో భూ సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను పెడతామని గతంలో అప్పటి సీఎస్‌ ప్రకటించారు. కానీ వెంటనే వెనక్కి తగ్గి, మళ్లీ తేదీలను ప్రకటిస్తామన్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ సదస్సుల మాటే ఎత్తడం లేదు. ధరణిలో దొర్లిన తప్పులతోనే రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌ విషయంలో ముఖ్యమంత్రి చెప్పే మాటలకు, జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది.

    ఇప్పుడు కేసీఆరే స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో ధరణి పాస్‌బుక్‌లో పొరపాటు ఉన్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబం పేరిట 53.30 భూమి ఉండాల్సి ఉండగా, 53.31 గా నమోదైందని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్‌కే ధరణితో సమస్య రావడంత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.