Telangana Night Curfew: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజువారి మరణాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో జనం భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యా రోగ్య శాఖ నిర్వహించిన జ్వరం సర్వేలోనూ లక్షణాలు ఉన్న వారి సంఖ్య బాగానే ఉంది. అయితే, వారికి హెల్త్ కిట్స్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నైట్ కర్ఫ్యూ విధింపుపై తెలంగాణ వైద్యారోగ్య శాక సంచాలకులు కీలక ప్రకటన చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకుగాను ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని డీహెచ్ తెలిపారు. అయితే, రాష్ట్ర సర్కారు కొవిడ్ కట్టడికి లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధింపునకు సుముఖంగా లేదని డీహెచ్ డి.శ్రీనివాసరావు క్లారిటీనిచ్చారు. కొవిడ్ కేసుల పాజిటివిటీ రేటు పది శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని, అయితే, తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని వివరించారు. ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు పది శాతం మించలేదని డీహెచ్ చెప్పారు.
ఇకపోతే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపిన శ్రీనివాసరావు.. ఆ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 4.26శాతంగా ఉందని, మేడ్చల్‌లో 4.22శాతం., మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14శాతం పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ప్రమాదకర పరిస్థితులు లేవు కాబట్టి నైట్ కర్ఫ్యూ అవసరం ఉండబొదన్నారు డీహెచ్.
ఇకపోతే రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 61 శాతంగా ఉందని, ముందు జాగ్రత్తగా ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకుగాను ఈ నెల 31 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని డీ.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వారం రోజులుగా లక్షకు పైగా కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు డీహెచ్. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని వివరించారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి వ్యాక్సినేషన్ అయిపోయిందని, రాష్ట్రంలో 2.16 లక్షల మందకి ప్రికాషన్ డోసు ఇచ్చామని నివేదికలో డీహెచ్ తెలిపారు.
Also Read: Online Classes In Telangana: తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసులు.. అంత శాతం హాజరు తప్పనిసరి..!
[…] Shavukaru Movie: తెలుగు సినీ ప్రపంచంలో ‘షావుకారు’ సినిమా గొప్ప క్లాసిక్ సినిమాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. విజయా వారి నుండి వచ్చిన ఈ అద్భుతమైన సినిమా వెనుక అప్పట్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందట. మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావును హీరోగా పెట్టాలని ప్లాన్ చేశారు ఎల్.వి.ప్రసాద్. కానీ.. చక్రపాణికి అక్కినేనితో ఈ సినిమా చేయడం ఇష్టం లేదు. […]