Online Classes In Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఈ నెల 30 వరకు రాష్ట్ర సర్కారు పొడిగించిన సంగతి అందరికీ విదితమే. అయితే, అకడమిక్ ఇయర్ లాస్ కాకూడదనే ఉద్దేశంతో ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారంగా.. విద్యార్థులు అప్రమత్తం కావాల్సి ఉంది.

Online Classes In Telangana
ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా సిలబస్ కంప్లీట్ చేయొచ్చనే అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఇక పోతే సోమవారం నుంచి ఉపాధ్యాయులు స్కూల్స్ కు వెళ్లనున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ టీచర్స్‌తో పాటు ఇతర సిబ్బంది 50 శాతం హాజరు కానున్నారు.
అలా స్కూల్స్ సోమవారం నుంచి మళ్లీ ఓపెన్ కానున్నాయి. అయితే, స్కూల్స్ కు టీచర్స్ మాత్రమే హాజరై అక్కడి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసెస్ చెప్పనున్నారు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేవారు. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకుగాను ఆన్ లైన్ క్లాసెస్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్టూడెంట్స్‌కు టీశాట్ ద్వారా క్లాసెస్ చెప్పనున్నారు. స్టూడెంట్స్ తమ షెడ్యూల్ ఫాలో అయి క్లాసెస్ వినాల్సి ఉంటుంది.
Also Read: తెలంగాణ బెటర్ అంటున్న ఏపీ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా!
స్కూల్ స్టూడెంట్స్ కు తొలుత ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులను ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. కాగా, కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత కూడా మళ్లీ విద్యా సంస్థలు తెరుచుకుంటాయా? లేదా ఇంకా సెలవులను పొడిగిస్తారా? అనేది అనుమానంగా ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ నెల 31 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ అవుతాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 31 నుంచి పాఠశాలలు ఓపెన్ అయ్యే క్రమంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్నిటినీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. మాస్కులు, శానిటైజర్స్ సప్లైపైన ఫోకస్ చేయనుంది. కరోనా నిబంధనలను పాటించి క్లాసెస్ కండక్ట్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ విద్యా శాఖ తగు ఏర్పాట్లను చేస్తోంది.
Also Read: విద్యావ్యవస్థ ప్రక్షాళన.. కేసీఆర్ సంచలన అడుగులు..తెలంగాణ బాగుపడుతుందా?