Uddhav Thackeray Resigns: మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్.. ప్రజల్లోకి పాదయాత్రగా ఉద్దవ్ ఠాక్రే

uddhav thackeray resigns మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వం కూలింది. మద్దతిచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బలంగానే నిలబడిన సొంత శివసేన పార్టీ ఎమ్మెల్యేలే వెన్నుపొటు పొడవడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎమ్మెల్యేలు ఎంతకు తిరిగి రాకపోవడంతో.. బలపరీక్షకు ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలడంతో అవమానకర రీతిలో సీఎం కుర్చీకి ఉద్దవ్ రాజీనామా చేసి వైదొలిగారు. బీజేపీతో కలిసి […]

Written By: NARESH, Updated On : June 29, 2022 10:27 pm
Follow us on

uddhav thackeray resigns మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వం కూలింది. మద్దతిచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బలంగానే నిలబడిన సొంత శివసేన పార్టీ ఎమ్మెల్యేలే వెన్నుపొటు పొడవడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎమ్మెల్యేలు ఎంతకు తిరిగి రాకపోవడంతో.. బలపరీక్షకు ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలడంతో అవమానకర రీతిలో సీఎం కుర్చీకి ఉద్దవ్ రాజీనామా చేసి వైదొలిగారు.

బీజేపీతో కలిసి పోటీచేసి గెలిచాక ఆ పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్, ఎన్సీపీల పంచన చేరి సీఎం అయిన ఉద్దవ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితికి దిగజారారు. పాలనలో కొడుకు ఆదిత్యా ఠాక్రే ప్రభావం ఎక్కువ కావడం.. శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీ కావడంతో జీర్ణించుకోలేని వారంతా తిరుగుబాటు చేసి ఉద్దవ్ ను గద్దె దించారు. నాడు బీజేపీకి ఉద్దవ్ ఎలా మోసం చేశారో.. ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలు ఉద్దవ్ కు అలానే చేశారు.

శివసేనకు ఉన్న 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండే పక్కన చేరడంతో శివసేన ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. షిండేతో చేసిన రాయబారాలు పనిచేయలేదు. ఉద్దవ్ , ఆదిత్య పోకడలు.. పాలన ఆధిపత్యాలు, హిందుత్వ వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన హిండే, శివసేన ఎమ్మెల్యేలు ఉద్దవ్ ను ఎదురించారు. గవర్నర్ రేపు బలపరీక్ష పెట్టి మైనార్టీలో పడిపోయిన శివసేన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ఆదేశించాడు.ఇక చేసేదేం లేక చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు ఎక్కిన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అక్కడా చుక్కెదురైంది. బలపరీక్షకు నిలిచి బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో ఇక తనకు బలం లేదని తెలిసి.. అనవసరంగా అసెంబ్లీలో పరువు పోగొట్టుకునే బదులు ముందే రాజీనామా చేయాలని తలంచారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే భారమైన హృదయంతో ఫేస్ బుక్ లైవ్ లో ప్రజలతో మాట్లాడి సీఎం కుర్చీ దిగిపోయారు. చైనా ఓ వైపు సరిహద్దుల్లో మన భూమిని ఆక్రమిస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం మహారాష్ట్రపై దృష్టి సారించిందని.. ఇక్కడ శివసేన ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీగా ఉందని ఉద్దవ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. కుట్ర పన్ని శివసేన ఎమ్మెల్యేలను లాగి కూల్చివేశారని ఆరోపించారు.

ఇక ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు స్వీట్లు తినిపించి నాయకులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నీవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షిండే మద్దతు ఫడ్నవీస్ కే ఉందని సమాచారం. తనకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఫడ్నవీస్ గవర్నర్ కు తెలియజేశారు. శివసేనలో తిరుగుబాటు చేసిన షిండే కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. రెబల్ శివసేన ఎమ్మెల్యేల్లో 10 మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. మరో 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీంతో బీజేపీలో కొత్త జోష్ నెలకొంది.

ఇక తిరుగుబాటు చేసిన షిండేతోపాటు శివసేన ఎమ్మెల్యేలను ప్రజల్లోనే ఎండగట్టాలని సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. పాదయాత్రకు నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్.. ప్రజల్లోకి పాదయాత్రగా ఉద్దవ్ ఠాక్రే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.