https://oktelugu.com/

Telangana: తెలంగాణలో జ్వరాల విజృంభణ

Telangana: తెలంగాణ రాష్ర్టంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆగస్టులో దాదాపు మూడు లక్షల మంది జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్ల చేరినట్లు తెలుస్తోంది. దీంతో జ్వరాల పంజా విసురుతోంది. రెండు నెలల్లో సుమారు ఐదు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల్లో సుమారు మూడు లక్షల మందికి పైగా కొవిడ్ కిట్లను అందజేశారు. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు చెలరేగిపోతున్నాయి. డెంగీ వంటి జ్వరాలు ప్రజలను ముప్పతిప్పలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 7, 2021 / 02:00 PM IST
    Follow us on

    Telangana: తెలంగాణ రాష్ర్టంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆగస్టులో దాదాపు మూడు లక్షల మంది జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్ల చేరినట్లు తెలుస్తోంది. దీంతో జ్వరాల పంజా విసురుతోంది. రెండు నెలల్లో సుమారు ఐదు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల్లో సుమారు మూడు లక్షల మందికి పైగా కొవిడ్ కిట్లను అందజేశారు. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు చెలరేగిపోతున్నాయి. డెంగీ వంటి జ్వరాలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి.

    ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు నెలలో జ్వరాలు 12 రెట్లు పెరగడం తెలిసిందే. మలేరియా కేసులు 2020 ఆగస్టులో 59 కాగా ఈ ఏడాది ఇదే నెలలో అంతకంటే రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగానే వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల్లోనే 188 డెంగీ కేసులు నమోదు కావడం చూస్తుంటే వ్యాధుల తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. హైదరాబాద్ లో 16 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఖమ్మంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని పేర్కొంటున్నారు.

    అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం లేదని తెలుస్తోంది. అందుకే వ్యాధుల ఉధృతి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎప్పటికప్పుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం స్పందించి ప్రజలను రోగాల బారి నుంచి రక్షించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

    ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంత ప్రభుత్వం కూడా బాధ్యతగా తీసుకుని జ్వరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వరద ప్రభావంతో దోమలు విజృంభించి రోగాల రాకకు కారణమవుతున్నారని తెలుస్తోంది. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం పక్కాగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.