https://oktelugu.com/

Kim Sharma, Leander Paes: పెళ్లికి రెడీ అవుతున్న ముదురు జంట !

Kim Sharma, Leander Paes: సినిమా ప్రేమ పక్షుల్లో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోన్న జంట కిమ్ శర్మ – లియాండర్ పేస్. ఈ జంట పై నిత్యం రూమర్లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కిమ్ శర్మ స్వయంగా ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఇక నుండి మీడియా మా గురించి ‘గాసిప్’లు రాయక్కర్లేదు. డైరెక్ట్ గా రాయొచ్చని మొత్తానికి తమ బంధం పై క్లారిటీ ఇచ్చింది. నిజానికి ‘కిమ్ శర్మ’లో మంచి టాలెంట్ […]

Written By:
  • admin
  • , Updated On : September 7, 2021 / 02:23 PM IST
    Follow us on

    Kim Sharma, Leander Paes: సినిమా ప్రేమ పక్షుల్లో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోన్న జంట కిమ్ శర్మ – లియాండర్ పేస్. ఈ జంట పై నిత్యం రూమర్లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కిమ్ శర్మ స్వయంగా ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఇక నుండి మీడియా మా గురించి ‘గాసిప్’లు రాయక్కర్లేదు. డైరెక్ట్ గా రాయొచ్చని మొత్తానికి తమ బంధం పై క్లారిటీ ఇచ్చింది.

    నిజానికి ‘కిమ్ శర్మ’లో మంచి టాలెంట్ ఉంది. పైగా అందంతో పాటు అదృష్టం కూడా ఉంది. అయినా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణం ఆమెనే. ఎప్పుడు కెరీర్ పై ఫోకస్ చేయలేదు. ఫెడ్ అవుట్ అయిపోయాక గానీ, అమ్మడుకు తత్త్వం బోధపడలేదు. ఇక అప్పటి నుంచి ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ తో అలరిస్తూనే ఉంది.

    అన్నట్టు 2010లో కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పంజానిని కిమ్ శర్మ పెళ్లాడింది. అయితే, అలీ.. ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ అన్ని రకాలుగా ఆమెకి టార్చర్ చూపించాడు. దాంతో 2016లో అతని నుండి ఆమె విడిపోయింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటూ వస్తోంది. మధ్యలో ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడినా అతను కూడా ఆమెకు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చాడు.

    దాంతో కిమ్ శర్మ చాలా కాలంగా ఒక తోడు కోసం ఎదురు చూసి మొత్తానికి మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం లియాండర్ పేస్ తోనే కిమ్ కలిసి ఉంటుంది. ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం విదేశాలలో వీరిద్దరూ రెస్టారెంట్లు, పబ్ లు అన్న తేడా లేకుండా తెగ తిరిగేస్తున్నారు.