Delhi Railway Station Stampede: ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాలో స్నానం చేయడానికి వెళుతున్న భక్తులు ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది దాకా కన్నుమూశారు.. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి.
ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనపై రైల్వే శాఖ నోరు విప్పింది.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది..” శనివారం ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రావడం కొంత ఆలస్యమైంది. 14వ ఫ్లాట్ ఫారం పై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే 12వ ప్లాట్ ఫారం పై ప్రత్యేక రైలు ఉందని ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒకసారిగా అక్కడికి వెళ్లిపోయారు. అయితే ఆ బ్రిడ్జి మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది చనిపోయారు.. చాలామంది గాయపడ్డారు.. అయితే ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. క్షతగాత్రులకు అండగా నిలుస్తున్నాం. ఇప్పటికే వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం.. గాయపడిన వారిలో చాలామంది కోలుకున్నారు. మిగతావారు కూడా కోలుకుంటారని.. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని” రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి..
మండిపడుతున్న ప్రతిపక్షా లు
వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టామని.., బుల్లెట్ రైళ్లు తీసుకొస్తామని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే దేశానికి బుల్లెట్, వందే భారత్ రైళ్లు అవసరమేనని.. కానీ అదే సమయంలో సగటు భారతీయుడు ఎక్కడానికి రైళ్లల్లో జనరల్ బోగీలు ఉండాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. మరోవైపు ఆర్జెడి అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఒకడుగు ముందుకు వేసి.. అసలు మహా కుంభమేళా నిర్వహించడమే శుద్ధ దండగ అని కొట్టి పారేశారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం జరగదని.. ఒక వర్గం మెప్పుకోసమే మహాకుంభమేళా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అసలు మహా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.. దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలే కారణమని పేర్కొన్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే రెస్పాండ్ అయింది. అసలు లాలు ప్రసాద్ యాదవ్ కు ఏమి తెలిసిన మాట్లాడుతున్నారని బిజెపి నాయకులు కౌంటర్ ఇచ్చారు. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో కుంభమేళా ను చూసి తట్టుకోలేక లాలూ ప్రసాద్ యాదవ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు..” ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తి ఓవర్గం వారి మీద ద్వేషం ప్రదర్శిస్తాడు. మిగతా వర్గం మీద ప్రేమ కురిపిస్తాడు. ఈయన దృష్టిలో ఆయనకు అనుకూలంగా ఉంటేనే గొప్పగా ఉంటుంది. లేకపోతే చెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా అదే వరుసలోకి వస్తాయి. మీడియాలో ఫేమస్ కావడానికి బిజెపి మీద విమర్శలు చేస్తున్నారు గాని.. వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. అందువల్లే వారు మౌనంగా ఉంటున్నారని” బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.