https://oktelugu.com/

కరోనాకు కేరాఫ్ గా మారిన ఢిల్లీ మర్కజ్

దేశంలో కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తోంది. దీని ద్వారా కరోనా కట్టడికి కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోంది. అయినప్పటికీ దేశంలో ఇప్పటివరకు 1,500వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా 40మంది మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగానే కరోనాకు కేరాఫ్ గా ఢిల్లీ మర్కజ్ తెరపైకి రావడంతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 97కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 15కొత్త కేసులు నమోదయ్యాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 1, 2020 / 11:36 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తోంది. దీని ద్వారా కరోనా కట్టడికి కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోంది. అయినప్పటికీ దేశంలో ఇప్పటివరకు 1,500వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా 40మంది మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగానే కరోనాకు కేరాఫ్ గా ఢిల్లీ మర్కజ్ తెరపైకి రావడంతో దేశం మొత్తం ఉలిక్కి పడింది.

    తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 97కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 15కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే కావడం గమనార్హం. ఈ 15మందిలో ఎక్కువగా జీహెచ్ఎంసీకి చెందిన వారితోపాటు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వాళ్లున్నట్లు తెలుస్తోంది. మర్కజ్ వెళ్లిచ్చొన వాళ్లలో ఆరుగురి చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్కడికి వెళ్లిచ్చొన వాళ్ల కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.

    కరోనాకు కేరాఫ్ గా మర్కజ్ లింకు బయటపడటంతో అక్కడికి వెళ్లొచ్చని వాళ్లందరు భయాందోళనకు గురవుతుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు స్పందించిన సుమారు 400మంది వరకు మంగళవారం గాంధీ ఆస్పత్రికి పొటెత్తారు. వీరికి వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించింది. వీరిలో 15మందికి పాజిటివ్ వచ్చింది. పలువురికి కరోనా లక్షణాలు ఉండటంతో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యులు ప్రకటిస్తున్నారు. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కరోనాకు మర్కజ్ లింక్ బయపడటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దీనిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ చేపడుతున్నారు.