Delhi Liquor Scam: ఏపీ హిస్టరీలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 17 నెలల టైముండగా అప్పుడే పార్టీలు రాజకీయాలు మొదలుపెట్టాయి. అయితే కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పోటా పోటీగా పోస్టర్లు, గోడ రాతలతో రోత పుట్టిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడో ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్’ అన్నారంటూ వైసీపీ వారు ఏకంగా పోస్టర్లు వేయించి గోడలకు అతికిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ట్రోల్ చేస్తున్నారు. దానికి విరుడుగా టీడీపీ నేతలు భారత్ పే కు పోటీగా భారతీ పే అనే పోస్టర్లను తెరపైకి తెచ్చారు. గోడలకు అతికించి మరీ ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలో పేటీఎంకు పేరడీగా పేసీఎం అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. 40 శాతం కమీషన్లకు అనుమతిస్తున్నారంటూ పోస్టర్లు అతికించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా నెటిజెన్లకు ఆకట్టుకున్నాయి.

ఇటీవల ఏపీలో కుటుంబసభ్యులను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. సాధారణ గృహిణి అయిన చంద్రబాబు సతీమణిని దారుణంగా అవమానించారు. ఎక్కడికక్కడే టీడీపీ నేతల కుటుంబాలను వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. మహిళలని చూడకుండా బయటపెడుతున్నారు. అయితే ఇంతవరకూ సహనంతో ఉన్న టీడీపీ నాయకులు సైతం అదే బాట పడుతున్నారు. వైసీపీ నేతల కుటుంబాల జోలికి వెళ్లక తప్పడం లేదని భావిస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి అల్లుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆయనకు ఏపీ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన సాక్షి దినపత్రికలో దాదాపు రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు టాక్. అయితే ఆయన్ను ఏక్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఉంది. దీంతో ఏపీ పెద్దలు కలవరపాటుకు గురవుతున్నారు.

లిక్కర్ స్కామ్ లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యంగా సీఎం జగన్ భార్య భారతి పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా రోజుల కిందటే బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు ఏపీ పర్యాటనకు వచ్చినప్పుడు తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కు తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధముందని ఆరోపించారు. కానీ అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి పేరు తెరపైకి రావడంతో ఇప్పడు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సతీమణి పేరు బయటకు వచ్చింది. టీడీపీ పోస్టర్లు అతికించే వరకూ వెళ్లింది.