Delhi Liqour Scam Telugu States: రాష్ట్ర ప్రభుత్వాల బలం, బలహీనతలే కేంద్ర ప్రభుత్వం ఇన్విస్ట్మెంట్. ఏ చిన్న అంశాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తప్పిదాన్ని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. చివరకు మమతా బెనర్జీలాంటి శక్తివంతమైన సీఎం కూడా తన సహచర మంత్రిని అరెస్ట్ చేసినా కిమ్మనకుండా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలకుల బలహీనతతో ఎలా ఆడుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే దేశంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా అవతరించింది. విపక్షాలు టచ్ చేయని రేంజ్ లో బలం పెంచుకుంటూ పోతోంది. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మరింత బలహీనంగా మారుతోంది. అటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు సాహిసించడం లేదు. వీలైనంత వరకూ అనుకువునే ప్రదర్శిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓకింత విరుద్ధ పరిస్థితులైతే మాత్రం ఉన్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో మాత్రం జగన్ సయోధ్యతో మెలుగుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. పరస్పర రాజకీయ అవగాహన కూడా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ తమతో ఉంటున్నారన్న భావన బీజేపీలో ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో పట్టుకు ఉన్న ఏ అవకాశాలను కేంద్రం విడిచిపెట్టడం లేదు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేతికి కీలక ఆయుధం ఒకటి దక్కింది. అదే జాతీయ స్థాయిలో వెలుగుచూసి లిక్కర్ స్కాం.

వెలుగులోకి ఇద్దరు పేర్లు..
ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నాయకుల పేర్లు వెలుగుచూడడమే ఇందుకు కారణం. స్కాం కు సంబంధించి సీబీఐ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు పరోక్షంగా బయటకు వచ్చాయి.ఇందులో ప్రధానంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి,అరబిందొ ఇండస్ట్రీస్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రాథమికంగా నమోదుచేసిన ఎఫ్ఐఆర్ మాత్రమేనని…మున్ముందు చాలామంది తెలుగు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనమవుతోంది. మున్ముందు ఎవరెవరి పేర్లు వినాల్సి వస్తుందోనన్న భయం మాత్రం నేతలను వెంటాడుతోంది. అయితే దీనిని పట్టుకొని బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో స్కోర్ పెంచుకోవాలని చూస్తోంది. భయం ఉన్నవారు బీజేపీ నీడకు వస్తారన్నది అంచనా వేస్తున్నారు. అలా కాకున్నా చెడ్డపేరు వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వాలైనా కొంత వెనక్కి తగ్గుతాయని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఒకేసారి పేర్లు వెల్లడించకుండా.. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ నాయకుల పేర్లు బయటపెట్టాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్తున్న పవన్ కళ్యాణ్
టీఆర్ఎస్ టార్గెట్..
ఢిల్లీ బీజేపీ ఎంపీ సర్వేశ్వర్ శర్మ తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. లిక్కర్ స్కాంలో చాలా మంది తెలంగాణా వారికి సంబంధమున్నట్టు ఆరోపించారు. మరోవైపు అరబిందో పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డికి వియ్యంకుడుగా చెబుతున్నారు. లిక్కర్ వ్యాపారంలో ఆరితేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కాం మరో ఎంపీకి చుట్టుకోవడంతో పాటు కీలక నేత విజయసాయిరెడ్డి సమీప బంధువు పేరు సైతం బయటకు రావడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మున్ముందు మరిన్ని పేర్లు..
అయితే కేసు పూర్వపరాలను సీబీఐ పైపైన మాత్రమే వెల్లడించింది. విస్తృత ప్రచారంలోకి వచ్చేలా వ్యూహాత్మకంగా చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా హైదరాబాద్ వచ్చి డీల్స్ చేస్తున్నారని.. ఇదంతా టీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. అదే సమయంలో వైసీపీ ఎంపీ పేరు బయటకు తీసుకొచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోందన్న అనుమానాలైతే ఉన్నాయి. అయితే మున్ముందు మాత్రం మరిన్ని ప్రకంపలు సృష్టించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
[…] […]