మద్యంప్రియులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

మద్యంప్రియులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో మద్యంపై ప్రత్యేకంగా విధించిన కరోనా టాక్స్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవడంతో కేంద్రం మే నెలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు మద్యం షాపులను తెరిచేందుకే మొగ్గు చూపారు. అయితే మద్యం కోసం జనం బారులు తీరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కరోనా టాక్స్ పేరిట మద్యంపై 70శాతం ధరలను […]

Written By: NARESH, Updated On : June 7, 2020 5:08 pm
Follow us on


మద్యంప్రియులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో మద్యంపై ప్రత్యేకంగా విధించిన కరోనా టాక్స్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవడంతో కేంద్రం మే నెలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు మద్యం షాపులను తెరిచేందుకే మొగ్గు చూపారు. అయితే మద్యం కోసం జనం బారులు తీరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కరోనా టాక్స్ పేరిట మద్యంపై 70శాతం ధరలను పెంచేసింది. మే 5 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.

మద్యం ఎమ్మార్పీపై ఏకంగా 70శాతం టాక్స్ విధించడంతో మద్యంప్రియుల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేంద్రం దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో కేజ్రీవాల్ మద్యంపై విధించిన కరోనా టాక్స్ ను ఎత్తిసేందుకు సిద్ధమయ్యారు. జూన్ 10నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం లభిస్తున్న మద్యం ధరలతో పొలిస్తే మరో రెండు మూడురోజుల్లో చౌకగా మద్యం లభించనుంది. దీంతో మద్యంప్రియులు జూన్ 10 తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడాన్ని ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాలు మద్యం ధరలను పెంచేశాయి. తెలంగాణలో కేవలం 11నుంచి 15శాతం మాత్రమే మద్యం ధరలను ప్రభుత్వం పెంచేంది. ఈ పెంచిన ధరలు మళ్లీ తగ్గించేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తొలుత 25శాతం ఆ తర్వాత 50శాతం మద్యం ధరలను పెంచేంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యనిషేధ పాలసీలో భాగంగా మద్యం ధరలను రెట్టింపు చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నాయి. ఏపీలో మద్యం ధరలు పెంచడంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే మద్యంబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మద్యం ధరలను తగ్గింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యంపై కరోనా ట్యాక్స్ ఎత్తివేయడంతో ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలను తగ్గించే అవకాశం లేకపోలేదని చర్చ నడుస్తుంది. మద్యంపై ధరలను ఏమేరకు తగ్గిస్తారనేది మద్యంప్రియులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యంప్రియులకు శుభవార్త తెలియజేస్తారా? లేదా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మద్యంబాబులు వేచిచూడాల్సిందే..!