Delhi election results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ముందు అధికార ఆప్, జాతీయ పార్టీ కాంగ్రెస్ నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఇప్పుడు కాకపోతే.. ఎప్పుడు కాదు అన్నట్లుగా బీజేపీ ఈసారి ఢిల్లీపీటం నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉచిత హామీలు కూడా ఇచ్చింది. దీంతో 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగురవేయబోతోంది. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ సర్కార్ ఏర్పటు ఖాయమే. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ 42, ఆప్ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 36. దీంతో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మరో 12 స్థానాల్లో బీజేపీ, ఆప్ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సగం స్థానాలు బీజేపీ గెలిచినా 50కి చేరువ అవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ మొదలైంది.
రేసులో నలుగురు..
ఢిల్లీలో ఆప్ గెలిస్తే మళ్లీ కేజ్రీవాల్ సీఎం అయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆప్ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయం. దీంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో ఉన్నవారిలో దుష్యంత్‌కుమార్ గౌతమ్ మొదటి వరుసలో ఉన్నారు. ఈయన కరోల్‌బాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత నాయకుడు. ఈయన రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. దుష్యంత్ గౌతమ్ రాజకీయంగా, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు.
పర్వేష్ వర్మ
ఢిల్లీ మాజీ సీఎం సాహింబ్‌సింగ్ వర్మ కుమారుడు సర్వేష్‌వర్మ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైనప్పటి నుంచి మూడో రౌండ్ ముగిసే వరకు పర్వేష్ ముందజలో ఉనారు. నాలుగో రౌండ్ నుంచి కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. పర్వేష్ గెలిస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది. వర్మ జాట్ సామాజికవర్గం నేత.
విజేందర్ గుప్తా..
సీఎం రోసులో ఉన్న మరో నేత విజయేందర్‌గుప్తా. పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నా.. 2015, 2020 ఎన్నికల్లో రోహిణిస్థానం నుంచి విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ అయిన గుప్తా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆప్ ధాటిని ఎదుర్కొన్న ఆయన అనుభవం అత్యున్నత పవికి బలమైన పోటీదారుగా నిలిబెట్టింది.
సతీశ్ ఉపాధ్యాయ్
సీఎం రోసులో ఉన్న నాలుగో నేత సతీశ్ ఉపాధ్యాయ్. ఈయన మాలవీయనగర అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. వృత్తిపరంగా వ్యాపారి అయిన సతీశ్.. రాజకీయ కార్యకలాపాల్లోనూ మంచి పట్టు సాధించారు. అనుభవజ్ఞుడు అయిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయన కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు. రాజకీయ అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్.
ఆధిష్టానం ఆశీస్సులు ఎవరిలో..
ఇదిలా ఉంటే.. నలుగురు సీఎం రేసులో ఉన్నా.. అధిష్టానం ఆశీస్సులు, సామాజిక సమీకరణలే కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఎవరివైపు మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తిగా మారింది. దళిత, జాట్ సామాజికవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.