Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ లో లో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్‌లో బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ 37-26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్, అతిషి, మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చాలా మంది పెద్ద నాయకులు కూడా ఈ ట్రెండ్‌లలో వెనుకబడి ఉన్నారు. ఇది కాకుండా, అవధ్ ఓజా కూడా పట్పర్‌గంజ్ స్థానంలో వెనుకబడి ఉన్నారు.
ట్రెండ్స్‌లో, బిజెపికి చెందిన పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానం నుండి ఆధిక్యంలో ఉండగా, కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుండి వెనుకబడి ఉన్నారు. బిజెపికి చెందిన రమేష్ బిధురి ఇక్కడ నుండి ముందంజలో ఉన్నారు. ఇది కాకుండా, జంగ్పురా స్థానం నుండి మనీష్ సిసోడియా వెనుకబడి ఉన్నారు. షకుర్ బస్తీ స్థానం నుండి సతేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు. షాహదారా నుంచి ఆప్ అభ్యర్థి జితేందర్ సింగ్ శాంతి ముందంజలో ఉన్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ముందంజలో ఉన్నారు.
విశ్వస్‌నగర్‌లో బిజెపికి చెందిన ఓపీ శర్మ, షాదారాలో బిజెపికి చెందిన సంజయ్ గోయల్ ముందంజలో ఉన్నారు. రాఖీ బిర్లాన్ తన సీటు మాదిపూర్ నుంచి వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బిజెపిలో చేరిన కైలాష్ గెహ్లాట్ తన స్థానం బిజ్వాసన్‌లో ముందంజలో ఉన్నారు. కరవాల్ నగర్ నుంచి బిజెపికి చెందిన కపిల్ మిశ్రా, చాందినీ చౌక్ నుంచి సతీష్ జైన్ ముందంజలో ఉన్నారు. మాల్వియా నగర్ స్థానంలో సోమనాథ్ భారతి వెనుకబడి ఉన్నారు. ఇక్కడ బిజెపికి చెందిన సతీష్ ఉపాధ్యాయ్ ముందంజలో ఉన్నారు. ఇది కాకుండా, రాజౌరి గార్డెన్ నుండి బిజెపికి చెందిన మంజీందర్ సింగ్ సిర్సా ముందంజలో ఉన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా బిజెపి ఆధిక్యంలో ఉంది. ఓఖ్లా నుంచి ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ వెనుకబడి ఉన్నారు. బిజెపికి చెందిన మనీష్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఇది కాకుండా, బల్లిమారన్ , ముస్తఫాబాద్ నుండి కూడా బిజెపి ఆధిక్యంలో ఉంది.