Delhi election results 2025 : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం(ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ఈమేరు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆప్, బీజేపీ హోరాహోరీగా ఆధికం కనబర్చాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం(ఫిబ్రవరి 8న) ప్రారంభమైంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించారు. ఇందులో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా ఆధిక్యం కనబర్చాయి. అధికారం నిలబెట్టుకునేందుకు ఆప్ తీవ్రంగా శ్రమించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని హోరాహోరీగా ప్రచారం చేశాయి. దానికి తగినట్లుగానే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్‌కు చెందిన ముగ్గురు అగ్రనేతలు వెనుకబడ్డారు. మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్‌పురా, ప్రస్తుత సీఎం కల్కాజీలో అతిశీ ముగ్గురూ పోస్టల్ బ్యాలెట్‌లో వెనుకబడ్డారు.
ముస్లిం ప్రాంతాల్లో ఆప్ ఆధిక్యం..
ఇదిలా ఉంటే.. ముస్లింలు ఎక్కువగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ఆప్ పట్టు నిలుపుకుంది. ముస్లిం ఓటర్లు గత మూడు ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 10 స్థానాల్లో ఆప్ పార్టీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆధిక్యంలో ఉన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ ఇదే పరిస్థి కనిపిస్తోంది. ముస్లిం ఓట్లు ఉన్న ప్రాతాల్లోనే ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీజేపీ దూకుడు..
ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపోల బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఈవీఎం ఓట్ల లెక్పింలో తొలి ట్రెండ్స్ పరిశీలిస్తే ఆప్ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే బీజేపీ అధికారంలోకి రావడం కాయంగా కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే..
ఇక ప్రస్తుతం ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుగుణంగానే వస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి ఆధిక్యం ఇచ్చాయి. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం తొలి రౌండ్ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.