Delhi assembly election results 2025 : ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో ఓటింగ్ శాతం తగ్గింది. 2013లో 66%, 2015లో 67%, 2020లో 63% ఓటింగ్ నమోదయింది.. ఈసారి మాత్రం 60.4 శాతానికి పడిపోయింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 12 రిజర్వ్ డ్ స్థానాలు కావడం విశేషం. మిగతావన్నీ జనరల్ సీట్లు.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగానే రంగంలోకి దిగాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ రాజకీయాలలో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిశి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.. ఇక 2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఢిల్లీలో ఒకప్పుడు కనీసం పోటీ కూడా చేయలేని ప్రాంతంలో.. బిజెపి ఇప్పుడు సత్తా చాటుతోంది.. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత ఆప్ అధికార పరంపర కొనసాగింది. 2013లో కాంగ్రెస్ పార్టీకి ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు తగ్గిపోవడం మొదలైంది. క్రమంగా కాంగ్రెస్ ఓట్లు ఆప్ కు వెళ్లడం మొదలైంది. అయితే 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ స్థాయిలో ఉద్యమం జరిగింది. అన్నా హజారే (Anna Hazare), అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితేనాడు కాంగ్రెస్ పార్టీని వారు బహిరంగంగానే విమర్శించారు.. అయితే 2013లో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ పార్టీ ఏర్పాటయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసి.. 28 స్థానాలలో గెలిచింది. అయితే ఆప్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో.. అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు.. 2013లో బిజెపి 30కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్ మార్క్ అందుకోలేకపోయింది. ఇక 2013 తర్వాత ఆప్ దూసుకుపోయింది. 2015, 2020లో వరుసగా గెలిచి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. 2013లో 28 సీట్లు, 29 శాతం ఓటింగ్ సాధించిన ఆప్ క్రమక్రమంగా తన పార్టీని బలోపేతం చేసుకుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25% ఓట్లను, 8 సీట్లను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 30 శాతానికి పైగా ఓట్లు సాధించి.. 31 సీట్లు దక్కించుకుంది.
2013 ఫలితాల తర్వాత..
2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. అయితే 2015లో మూడు సీట్లకే పడిపోయింది. అయితే ఎన్నికల్లో బిజెపికి 30% కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అయితే ఆప్ 50% పైగా ఓట్లను పొంది 67 సీట్లను సొంతం చేసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పది శాతం ఓట్లు కూడా సాధించలేకపోవడం విశేషం.. ఇక 2020లో ఆప్ 50% పైగా ఓట్లు సాధించి 60 కంటే ఎక్కువ సీట్లును దక్కించుకుంది. బిజెపి 8 సీట్లకే పరిమితమైంది. కానీ దాని ఓట్ల వాటా 30% పైగా ఉండడం విశేషం. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం విశేషం.. 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయాయి.. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిగా ఆప్, కాంగ్రెస్ ఏర్పడినప్పటికీ.. బిజెపి దూకుడును కట్టడి చేయలేకపోయాయి.. 2013 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఆప్ తో కాంగ్రెస్ చేతులు కలిపింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని.. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరువేరుగా పోటీ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి.