డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. దీంతో కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో పదోతరగతి విద్యార్థుల పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రీఫైనల్లో వచ్చిన మార్కులు, అసైన్మెంట్ ద్వారా విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయానికి పూర్తయ్యాయి. దీంతో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు సజావుగానే జరిగాయి. అయితే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 5:05 pm
Follow us on


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. దీంతో కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో పదోతరగతి విద్యార్థుల పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రీఫైనల్లో వచ్చిన మార్కులు, అసైన్మెంట్ ద్వారా విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయానికి పూర్తయ్యాయి. దీంతో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు సజావుగానే జరిగాయి. అయితే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇంటర్మీయట్ బోర్డు ప్రభుత్వ నిబంధనల మేరకు పేపర్ వాల్యుయేషన్ చేపట్టింది. ఈమేరకు ఇంటర్ రిజల్ట్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల లైన్ క్లియర్ కావడంతో డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఇప్పటికే డిగ్రీ, పీజీ ఫైనలియర్ మినహా మిగతా విద్యార్థులను పరీక్షల్లేకుండానే ప్రమోట్ చేసింది. పరిస్థితి బట్టి వీరికి నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడిలోకి రాకపోవడంతో డిగ్రీ ఫైనల్, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు కూడా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఉన్నతా విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దుచేసి, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగానే ప్రమోట్‌ చేయాలనే అభిప్రాయాన్ని మెజార్టీ అధికారులు వ్యక్తం చేసినట్లు తెల్సింది. ఈమేరకు పరీక్షలను రద్దు చేసేందుకే అధికారులు మొగ్గుచూపుతుండటంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికెళ్లి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితోపాటు బీటెక్ పరీక్షల రద్దును కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాబోయే విద్యాసంవత్సరం క్లాసులను ఏవిధంగా నిర్వహించాలో అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదో పరీక్షలు రద్దయిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు కూడా రద్దవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.