https://oktelugu.com/

మహేశ్‌ సరసన మహానటి.. ఇది ఫిక్స్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’పై తెగ చర్చ నడుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌పై రోజుకో వార్త బయటకొస్తోంది. తొలుత పూజా హెగ్డే అన్నారు. ఆపై, కియారా అద్వానీ పేరు వచ్చింది. ఆపై, బాలీవుడ్‌ యువ నటి సయీ మంజ్రేకర్ని సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దాంతో , మహేశ్‌కు జోడీ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు చిత్ర బృందం హీరోయిన్‌ను ఖాయం చేసింది. సూపర్ స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : June 19, 2020 / 12:16 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’పై తెగ చర్చ నడుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌పై రోజుకో వార్త బయటకొస్తోంది. తొలుత పూజా హెగ్డే అన్నారు. ఆపై, కియారా అద్వానీ పేరు వచ్చింది. ఆపై, బాలీవుడ్‌ యువ నటి సయీ మంజ్రేకర్ని సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దాంతో , మహేశ్‌కు జోడీ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు చిత్ర బృందం హీరోయిన్‌ను ఖాయం చేసింది. సూపర్ స్టార్ తో నటించే లక్కీ చాన్స్‌ యువ నటి కీర్తి సురేశ్‌ను వరిచింది. ఈ విషయాన్ని కీర్తినే తెలిపింది. ఇన్‌స్టా గ్రాం వేదికగా తన అభిమానుతో ముచ్చటించిన కీర్తి ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. తన తదుపరి ప్రాజెక్ట్‌లో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్నట్లు స్వయంగా చెప్పింది. దీంతో మహేష్‌బాబు సినిమా సర్కారు వారి పాటలో కీర్తి నటిస్తున్నట్లు స్పష్టం అయ్యింది.

    తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

    మహానటితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి అయితే ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ వస్తుందని ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం భావించిందని తెలుస్తోంది. దక్షిణాది పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ..సూపర్ స్టార్ తో మూవీ అనగానే కీర్తి డేట్స్‌ అడ్జస్ట్‌ చేసిందట. దాంతో, టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. కాగా, కీర్తి తాజాగా ఒక విభిన్నమైన కథనం పెంగ్విన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా థియేటర్లు తెరవడానికి సర్కారు అనుమతినివ్వక పోవడంతో ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజే విడుదలైంది. కీర్తి చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులున్నాయి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తా’ చిత్రంలో కీర్తి ఆయనకు కూతురుగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉంది. అలాగే, తెలుగులో ‘రంగ్ దే’ , ‘మిస్ ఇండియా, ‘గుడ్ లక్ సఖి’, మలయాళంలో ‘మరక్కార్’ చిత్రాలు చేస్తోందామె.